డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ పై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా కాలంలో ఓటీటీని మించిన ఆప్షన్ మరొకటి లేదనీ.. డిజిటల్ రిలీజ్ లు చేసుకోవడమే మేలని చాలా మంది నిర్మాతలు స్టేట్ మెంట్ ఇస్తున్నారు. అయితే ఓ మల్టీ చైన్ మల్టీ ప్లెక్స్ సంస్థ మాత్రం ఈ డైరెక్ట్ ఓటీటీని వ్యతిరేకిస్తోంది. మ్యూచువల్ బెనిఫిట్స్ ని మరిచిపోవద్దని దర్శక నిర్మాతలకు ఓపెన్ లెటర్ రాసింది. 

 

లాక్ డౌన్ తో ఎనిమిది వారాలుగా థియేటర్స్ మూతపడి ఉన్నాయి. లాక్ డౌన్ ఎత్తేసినా సినిమా హాళ్లు ఎప్పుడు తెరుచుకుంటాయి అనేది తెలియడం లేదు. దీంతో హిందీ ఫిల్మ్ గులాబో సితాబో సినిమాను డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు. జూన్ 12న ఈ సినిమాను డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. 

 

సుజిత్ సర్కార్ దర్శకత్వంలో అమితాబ్  బచ్చన్, ఆయుష్ ఖురానా లీడ్ రోల్స్ లో రూపొందింది గులాబో సితాబో సినిమా. ఈ మూవీని ఏప్రిల్ 17న రిలీజ్ చేయాలనుకుంటున్నారు దర్శక నిర్మాతలు. కానీ లాక్ డౌన్ తో కుదరలేదు. దీంతో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అని ప్రకటించారు. ఈ అనౌన్స్ మెంట్ పైనే అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. పెద్ద లెటర్ పోస్ట్ చేసింది ఐనక్స్ సంస్థ.

 

గులాబో  సితాబో నిర్మాతలు థియేటర్ రన్ ని స్కిప్ చేసి.. డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయడం తమన డిసప్పాయింట్ చేసిందనీ.. కంటెంట్ మేకర్స్ కు ఎగ్జిబిటర్స్ కు మ్యూచువల్ బెనిఫిట్స్ ఉంటాయనీ. వాటిని దెబ్బకొట్టద్దంటూ ట్విట్టర్ లో ఓ లెటర్ పోస్ట్ చేసింది ఐనాక్స్ సంస్థ. అయితే అమితాబ్, ఆయుష్ మాన్ లాంటి స్టార్స్ ఉన్నారు కాబట్టి ఈ మల్టీప్లెక్స్ అధినేతలు స్పందించారు. 

 

మొత్తానికి అంత పెద్ద సినిమాను ఓటీటీలో రిలీజ్ నిర్ణయంపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా సినిమాను చూస్తే థియేటర్ లోనే చూడాలి. పెద్ద స్క్రీన్ పై నచ్చిన నటీనటులు సినిమాను చూస్తే అదే పెద్ద ఆనందం. సినిమా చూశామన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. మరి ఓటీటీ ఫార్మాట్ కు సినీ జానాల్లో ఏమాత్రం ఆదరణ లభిస్తుందో చూద్దాం..  

మరింత సమాచారం తెలుసుకోండి: