మళ్లీ షూటింగ్ మొదలయ్యేనాటికి మన దర్శకులు లక్ష్యాలను చేరుకుంటారా.. ప్రస్తుతం తీస్తున్న సినిమాలను పక్కనపెట్టేసి కొత్త కథలు రాసుకుంటున్నారు. ఏయే హీరోలను దృష్టిలో పెట్టుకొని కథలు రాశారు. 

 

కరోనా టైమ్ లో రాజమౌళి మహేశ్ సినిమాను ఎనౌన్స్ చేసి సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చే అవకాశం లేదు. లాక్ డౌన్ టైమ్ లో మహేశ్ సినిమా కథపై ఫోకస్ పెట్టినట్టు రాజమౌళీనే స్వయంగా చెప్పాడు. ట్రిపుల్ ఆర్ షూటింగ్ మొదలయ్యేలోపు.. లైన్ అనుకుంటాడా లేదంటే.. కథనే ఓ కొలిక్కి తెస్తాడో చూడాలి. 

 

రాజమౌళి తన ప్రతి సినిమాకూ ఊహించని ట్విస్టులిస్తాడు. మగధీర లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సునీల్ తో జక్కన్న మర్యాదరామన్న తీస్తాడని ఎవరూ అనుకోలేదు. అలాగే.. ఈగను హీరో చేశాడు. ఇద్దరు స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ను ఒకే ఫ్రేమ్ లోని తీసుకొచ్చిన ఘనత రాజమౌళికే దక్కింది. మరి మహేశ్ తో సినిమా ఉంటుందన్న ఆసక్తి అందరిలో ఉంది.

 

లాక్ డౌన్ హాలిడేస్ లో కొరటాల తర్వాతి మూవీ కథపై దృష్టి పెట్టాడు. అయితే.. ఆ కథ ఏ హీరో కోసమో చెప్పలేదు. ఆచార్య తర్వాత కొరటాల లిస్ట్ లో ముగ్గురు హీరోలున్నారు. రామ్ చరణ్ తో తీయాలనుకున్న సినిమా ఆగిపోయింది. మరో కథతో వద్దామనుకున్నారు. అయితే.. ఆచార్యలో రామ్ చరణ్ నటించడంతో.. వెంటనే చెర్రీతో సినిమా తీయాలనుకోవడం లేదు కొరటాల. ఇక ఈ దర్శకుడి లిస్ట్ లో ఇద్దరు స్టార్స్ మహేశ్.. ఎన్టీఆర్ ఉన్నారు. వీళ్లలో ఎవర్ని ఎంచుకుంటారో చూడాలి. 

 

పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ మూవీ తీస్తున్నాడు. ముంబైలో 40రోజుల షూటింగ్ పూర్తి చేసుకొచ్చింది. హైదరాబాద్ లో షూట్ చేద్దామంటే కరోనా అడ్డుపడింది. ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేని పూరీ.. మరో సినిమాకు స్క్రిప్ట్ ప్రిపేర్ చేస్తున్నాడు. పైసా వసూల్ తర్వాత పూరీ, బాలకృష్ణ మరోసారి కలిసి చేద్దామనుకున్నారు. బాలయ్య కోసమే ఈ కథ రాశాడో తెలియాల్సి ఉంది. 

 

సాధారణంగా దర్శకులు ఒక సినిమా పూర్తికాగానే.. మరో మూవీపై దృష్టిపెడతారు. ఒకవేళ ఆలోచించాలన్నా టైమ్ దొరకదు. లాక్ డౌన్ కారణంగా కథలపై కావాల్సినంత సమయం దక్కింది. అనుకోకుండా వచ్చిన కాలాన్ని వేస్ట్ చేసుకోకుండా కథలు రెడీ చేసుకుంటున్నారు. 

 

ఇక అనిల్ రావిపూడి అయితే.. ఎఫ్ 3 కథను రెడీ చేస్తున్నాడు. ప్రకాశం జిల్లాలోని స్వగ్రామంలో ఉంటూ.. ఆల్ రెడీ కథ పూర్తి చేశాడు. అయితే ఎఫ్ 3లో మూడో హీరో ఉన్నాడని ముందే చెప్పాడు. మరి ఏ హీరోను దృష్టిలో పెట్టుకొని కథ రాసుకున్నాడో తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: