సైరా తో పాన్ ఇండియా కేటగిరీలోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. మరోసారి చిరు సరసన కాజల్ అగ్ర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాం చరణ్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషించనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో లాక్ డౌన్ తర్వాత క్లారిటి రానుంది. ఇక ఇప్పటికే 40 శాతం షూటింగ్ జరుపుజుకున్న ఈ సినిమా జూలై నుండి షూటింగ్ మొదలు పెట్టి నాన్ స్టాప్ గా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అండ్ ప్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను కంప్లీట్ చేసి సంక్రాతికి భారీ స్థాయిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు కొరటాల శివ.

 

ఈ విషయంలో కాంప్రమైజ్ అయ్యో ఛాన్సే లేదని తెలుస్తుంది. ఇప్పటికే లేటయిన నేపథ్యంలో ఒక వైపు షూటింగ్ జరుపుతూనే మరో వైపు ఎడిటింగ్, డబ్బింగ్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్దం చేసినట్టు తాజా సమాచారం. ఇక కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో “అన్నాత్తే” సినిమా చేస్తున్నాడు. నయనతార, కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమా కూడా ఇప్పటికే కొంత టాకీపార్ట్ కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ సీనియర్ స్టార్స్ ఇద్దరు బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగుతున్నారని తెలుస్తుంది.  

 

సూపర్ స్టార్ రజినీ కాంత్ “అన్నాత్తే” సినిమాను 2021 సంక్రాంతి బరిలోనే దింపబోతున్నట్టు యూనిట్ ముందుగానే క్లారిటి ఇచ్చింది. మొత్తానికి ఈ సంక్రాంతికి టాలీవుడ్ మెగాస్టార్.. కోలీవుడ్ సూపర్ స్టార్ భారీ స్థాయిలో పోటీ పడబోతుండటం రెండు ఇండస్ట్రీలల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇక రజనీకాంత్ దర్బార్ ఈ ఇయర్ ప్రారంభంలో సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే రజనీకాంత్ సినిమా తెలుగులో రిలీజవుతుందన్న విషయంలో పక్కా క్లారిటి ఉన్నప్పటికి మెగాస్టార్ కొరటాల శివ ల ఆచార్య మాత్రం ఇపటి వరకు ఒక్క తెలుగు తప్ప మిగిలిన ఏ ఏ భాషల్లో రిలీజ్ చేస్తారన్న క్లారిటి లేదు. అంటే ఇక్కడ మెగాస్టార్ కి రజనీ పోటీ ఇస్తున్నప్పటికి అక్కడ రజనీ కి మెగాస్టార్ పోటీ ఇవ్వడం లేదా అన్న చర్చలు సాగుతున్నాయట. 

మరింత సమాచారం తెలుసుకోండి: