ఎట్టకేలకు టాలీవుడ్ నుండి ఓ పెద్ద  సినిమా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కావడం దాదాపు ఖాయమైంది. కరోనా ఎఫెక్ట్ తో మరో మూడు నెలల వరకు థియేటర్లు  తెరుచుకోవని స్వయంగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించడం తో నిర్మాతలు ,ఓటిటి లను ఆశ్రయిస్తున్నారు. అందులో భాగంగా స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన నిశ్శబ్దం డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ కానుంది. ఇటీవలే ఈ వార్తలు రాగ మేకర్స్  అలాంటిదేమీ లేదని థియేటర్లోనే సినిమా విడుదలకానుందని ప్రకటించారు కానీ ఇప్పుడు మనసు మార్చుకొని డైరక్ట్ గా ఓటిటి లోకి విడుదలచేయడానికి సిద్ధపడ్డారని సమాచారం.
 
 
 అమెజాన్ ప్రైమ్ అన్ని భాషలకు గాను ఈ సినిమా డిజిటల్ హక్కులను 26కోట్లకు దక్కించుకుంది. దాంతో వచ్చే నెలలో ఈసినిమా ప్రైమ్ లో విడుదలకానుందని తెలుస్తుంది. ఇక నిశ్శబ్దం బాటలోనే మరి కొన్ని తెలుగు సినిమాలు కూడా పయనించనున్నాయి. హేమంత్ మధుకర్ తెరకెక్కించిన నిశ్శబ్దం లో తమిళ నటుడు మాధవన్ ప్రధాన పాత్రలో నటించగా యువ హీరోయిన్లు అంజలి ,షాలిని పాండే లతో పాటు సుబ్బరాజు ,మైఖేల్ మాడిసన్ ముఖ్య పాత్రల్లో నటించారు.  
 
 
 సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో కోన ఫిలిం కార్పొరేషన్ ,పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ల పై  కోన వెంకట్, టిజి విశ్వ ప్రసాద్ నిర్మించిన గోపి సుందర్ సంగీతం అందించాడు. ఇక భాగమతి తరువాత అనుష్క నటించిన చిత్రం కావడం అలాగే ఇటీవల విడుదలైన  టీజర్ మంచి రెస్పాన్స్ ను తెచ్చుకోవడంతో నిశ్శబ్దం పై  ప్రేక్షకుల్లో మంచి అంచనాలే వున్నాయి మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.   
 

మరింత సమాచారం తెలుసుకోండి: