1996లో వచ్చిన భారతీయుడు 2 ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. లంచం తీసుకోవడం నేరం అనే అంశాన్ని తీసుకొని శంకర్ ఈ చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. లంచం తీసుకునే అధికారులకు సింహస్వప్నంలా కమల్ హాసన్ కనిపించారు. అంతేకాదు కన్నకొడుకైనా సరే లంచం తీసుకుంటే శిక్షించక తప్పదు అనే సారాంశాన్ని ప్రజల కళ్లకు కట్టారు. ఇపుడు భారతీయుడు 2 ఏమాత్రం మెప్పిస్తుందోచూడాలి. 

 

భారతీయుడు 2 సినిమా కష్టాలు ఫేస్ చేస్తున్నాడు. ఒకటి తర్వాత ఒకటి మరొకటి. వీటి నుంచి బయట పడటానికి నిర్మాత ఓ ప్లాన్ వేశాడు. ఇందులో ఎంత నిజముందో గానీ.. బడ్జెట్ కంట్రోల్.. ఇదొక్కటే మార్గమని నిర్మాతలు భావిస్తున్నారట. రోబో టు పాయింట్ ఓ తర్వాత శంకర్ భారతీయుడుకు సీక్వెల్ గా భారతీయుడు 2 ప్లాన్ చేశాడు. అసలే సినిమా లేటుగా మొదలైందనుకుంటే.. అన్నీ బ్రేకులే. వీటి నుంచి బయటపడి.. షూటింగ్ నడుస్తుంది అనుకుంటే.. క్రేన్ యాక్సిడెంట్ భారతీయుడు 2 యూనిట్ ను అప్ సెట్ చేసింది. ముగ్గురు చనిపోవడం.. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించడంతో షూటింగ్ ఆగిపోయింది. ఇంతలో కరోనా రావడంతో.. షూటింగ్ ఊసే లేకుండా పోయింది. 

 

భారతీయుడు 2 షూటింగ్ సగం కూడా పూర్తికాకుండానే.. బడ్జెట్ అంచనాలు దాటిపోయింది. క్రేజ్ లేని కమల్ హాసన్ కు ఇంత ఖర్చు పెట్టడంపై.. నిర్మాత అసహనంగా ఉన్నాడట. దీనికి తోడు దెబ్బ మీద దెబ్బలు. ముందు భారీ బడ్జెట్ తట్టుకోవడం నిర్మాతకు పెద్ద సవాల్ గా మారింది. ఈ క్రమంలో రెండు పార్ట్ లుగా రిలీజ్ చేస్తే.. బడ్జెట్ భారం తగ్గుతుందన్నఆలోచనలో నిర్మాత ఉన్నాడట. 

 

రెండు పార్టులుగా తీస్తే మరో రిస్క్ ఫేస్  చేయాల్సి ఉంటుంది. తేడా వస్తే మాత్రం.. మూడో పార్ట్ ను ఆడియన్స్ పట్టించుకోరు. ఇలా రెండు పార్టులుగా రిలీజ్ చేయాలనేది ఒక ఆలోచన మాత్రమేనట. ముందు కరోనా పరిస్థితుల నుంచి.. క్రేన్ యాక్సిడెంట్ కేసు నుంచి భారతీయుడు 2బయటపడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: