సినిమాలకు వందల కోట్ల కలక్షన్స్ కురిపించే సమ్మర్ సీజన్ కరోనా దెబ్బతో మిస్ కావడంతో ప్రస్తుతం నిర్మాతలు అంతా ఒటిటి ప్లాట్ ఫామ్ ల వైపు అడుగులు వేస్తున్న పరిస్థితులలో సినిమాపరిశ్రమలో సరికొత్త ట్రెండ్ కు మార్గం సుగమం అయిందా అన్నసందేహాలు వస్తున్నాయి. ప్రస్తుతం రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాలు అన్నీ ఒటిటి వైపు వెడుతున్న పరిస్థితులలో ప్రతి హోమ్ ధియేటర్ గా మారబోతోంది.


అమెజాన్ ప్రైమ్ లో 7 కొత్త సినిమాలకు లైన్ క్లియర్ కావడంతో ప్రస్తుతం జనం అంతా ఆన్ లైన్ స్ట్రీమింగ్ యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకునే పనిలో చాలబిజీగా ఉన్నారు. జ్యోతిక ‘పొన్ మగళ్ వందాల్’ అమితాబ్ ‘గులాబో సితాబో’ కీర్తి సురేశ్ ‘పెంగ్విన్’ విద్యాబాలన్ ‘శకుంతలా దేవి’ అక్షయ్ కుమార్ ‘లక్ష్మీ బాంబ్’ అనుష్క ‘నిశ్శబ్దం’ ఇలా అనేక సినిమాలు ధియేటర్లలో కాకుండా ఇంటిలోనే డైరెక్ట్ గా రిలీజ్ కాబోతున్నాయి.


ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలలో ఉండే భారతీయులు అంతా తమకు నచ్చిన సమయాలలో తమకు నచ్చిన సినిమాలను చూడబోతున్నారు. దీనితో ఇక రానున్న రోజులలో ప్రేక్షకులు ధియేటర్స్ వైపు చూడరా అన్నసందేహాలు పెరిగిపోతున్నాయి. 1920 ప్రాంతంలో భారత్ లో స్పానిష్ ఫ్లూ వచ్చినప్పుడు అప్పుడప్పుడే సినిమాలను చూడటానికి అలవాటు పడుతున్న ఇండియన్స్ ఇక సినిమాలు చూడరు అన్నప్రచారం జరిగింది. 1942 ప్రాంతంలో రెండవ ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు అప్పటికే సినిమాలు చూడటం అలవాటు పడిన ఇండియన్స్ మళ్ళీ సినిమాలు చూడరు అన్నసందేహాలు వచ్చాయి. ఆతరువాత 1980 ప్రాంతంలో బుల్లితెర ఆపై కాలంలో అనేక ఎంటర్ టైన్మెంట్ ఛానల్స్ మూకమ్మడిగా ప్రారంభం కావడంతో ఇక ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీఈ దెబ్బకు కోలుకోవడం కష్టం అంటూ ప్రచారం జరిగింది.


అయితే ఈసవాళ్ళను అధిగమించి సినిమాల కలక్షన్స్ వందల వేల కోట్ల స్థాయికి చేరుకున్నాయి. ఇలాంటి పరిస్థితిలో సినిమాయే ప్రపంచంగా మారిపోయిన ప్రజల దృష్టిని మరల్చడానికి ఇప్పుడు ఒకేసారి ఒటిటి దాడి మొదలై ఒకేసారి 7 సినిమాలు విడుదల అవుతున్న పరిస్థితులలో కరోనా గ్యాప్ తరువాత ధియేటర్లకు జనం రాకపోవచ్చు అన్నప్రచారం ఊపందుకుంది. ఇది ఇలా ఉంటే ఒకేసారి 7భారీ సినిమాలు విడుదల అవుతున్న పరిస్థితులలో ఈసినిమాలను విడుదల చేస్తున్న నిర్మాతలను ఐనాక్స్ ధియేటర్స్ చైన్ తమిళ ఎగ్జిబీటర్ ల అసోసియేషన్ లు బహిరంగంగా ఒటిటి లో విడుదల అవుతున్న సినిమాలలో నటిస్తున్న నటీనటులకు హెచ్చరికలు ఇస్తూ భవిష్యత్ లో వీరంతా నటించే సినిమాలను తాము ప్రదర్శించమని హెచ్చరికలు చేస్తున్నాయి. దీనితో నేటి నట్టింట్లో విడుదల మరిన్ని సమస్యలకు కేంద్రం అవుతూ ఇప్పటికే సమస్యలలో మునిగిపోయిన ఫిలిం ఇండస్ట్రీని మరిన్ని సమస్యల సుడిగండంలోకి నెట్టివేస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: