కరోనా మహమ్మారి దేశంలో సినిమా రంగం కూడా ఒక్క‌సారిగా స్థంభించి భారీ నష్టాల్లో కురుకుపోతుంది. ముఖ్యంగా వేసవి కాలం వచ్చిందంటే ప్రజలందరికి సినిమాలతో మస్త్ టైంపాస్ అవుతుంది. అదే సినీ ఇండస్ట్రీ ఇప్పుడు థియేటర్లు మూసివేసి సైలెంట్ అయింది. ఈ స‌మ్మ‌ర్‌లో సీజ‌న్‌ లో విడుదల కావాల్సిన సినిమాల జాబితా పెద్దగానే ఉంది. కానీ కరోనా కార‌ణంగా అన్నీ వాయిదా ప‌డ్డాయి. కానీ కొన్ని సినిమాలు లాక్ డౌన్ లో కూడా పోస్ట్ ప్రోడక్షన్ పనులు పూర్తి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత థియేటర్స్ లో మెరవడానికి సినిమాలన్నీ వరుసగా క్యూ కడతాయని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు వేరేలా ఉన్నాయి. లాక్ డౌన్ ఎత్తేసి తటర్స్ కి ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా ఒకప్పటిలా థియేటర్స్ కి జనాలు వస్తారో లేదో తెలియదు. దీంతో అన్ని సినిమాలు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన 'మాస్టర్' సినిమా కూడా ఓటీటీలో విడుదల కాబోతోదంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా నిర్మాతలు దీనిని ఖండించారు. 'మాస్టర్' సినిమాను ఓటీటీలో విడుదల చేయడం లేదని.. కరోనా ప్రభావం తగ్గేదాకా వెయిట్ చేసి థియేటర్స్ లో రిలీజ్ చేస్తామని చెప్పి రూమర్స్ కి చెక్ పెట్టేసారు. ఐతే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతోందో అంటూ విజయ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగులో కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న అతికొద్ది పరభాషా నటులలో విజయ్ కూడా ఉంటాడని చెప్పొచ్చు. 'తుపాకి' 'సర్కార్' 'పోలీసోడు' 'విజిల్' మరియు 'అదిరింది' లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు. ఇప్పుడు విజయ్ తన కెరీర్లో 64వ చిత్రంగా 'మాస్టర్' అనే సినిమా చేసాడు. ఈ సినిమాకి లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వం వహించారు. మ్యూజిక్ సెన్సేషనల్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించింది. అంతేకాకుండా ఈ సినిమాలో 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి గ్యాంగ్ స్టర్‌ గా నటించారు. ఎక్స్‌బి ఫిల్మ్ క్రియేటర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అన్నీ బాగుండుంటే ఏప్రిల్ లో విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమాని ఈస్ట్ కోస్ట్ క్రియేషన్స్ వారు రిలీజ్ చేయనున్నారు. అయితే లేటెస్టుగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమాని దీపావళి ఫెస్టివల్ సందర్భంగా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోందట. దీనికి సంభందించిన ఆఫీసియల్ అనౌన్స్మెంట్ రానప్పటికీ ఇదే నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఇద్దరు తమిళ నటులు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో 'మాస్టర్' పై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: