ఇండియన్‌ స్క్రీన్ మీద తొలి లిప్‌ లాక్‌ 1929లోనే రిలీజ్ అయితే.. లాంగెస్ట్ లిప్‌ లాక్‌ ఎప్పుడు రిలీజ్ అయ్యిందో తెలుసా.? ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు నిమిషాల లిప్‌ లాక్‌ సీన్‌ను 30లలోనే తెరకెక్కించారు మన దర్శక నిర్మాతలు.

 

హీరో హీరోయిన్ను తాకటమే పెద్ద విషయం అనుకుంటున్న రోజుల్లోనే నాలుగు నిమిషాల సుధీర్ఘ లిప్‌ లాక్‌ను తెరకెక్కించారు మేకర్స్‌. కర్మ సినిమాలో దేవికా రాణి, హిమాన్షు రాయ్‌ల మీద ఈసన్నివేశాన్ని చిత్రీకరించారు. దేవికా, హిమాన్షులు నిజ జీవితంలో కూడా భార్య భర్తలు కావటంతో ఈ సీన్‌ చిత్రీకరణకు అంగీకరించారు.

 

ఇదే సినిమాను తరువాత నగన్‌ కి రాగిణి పేరుతో రిలీజ్ చేశారు చిత్రయూనిట్. దేవికా రాణి ఫస్ట్ లేడీ ఆఫ్‌ ఇండియన్‌ సినిమాగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమాలో తెర మీద నాలుగు నిమిషాల పాటు ముద్దు సన్నివేశం కనిపించింది. అయితే చిత్రీకరణ సమయంలో ఇంకా లెంగ్త్‌ తోనే లిప్ లాక్ చిత్రీకరించారట. అయితే అప్పటి నిబంధనల ప్రకారం సెన్సార్ బోర్డ్ సన్నివేశాన్ని 4 నిమిషాలకు పరిమితం చేసింది. అంతేకాదు అప్పట్లోనే ఏ సర్టిఫికేట్ తో సినిమాను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

 

ఆ తరువాత ఇండియన్ స్క్రీన్ చాలా లిప్ లాక్ సన్నివేశాలు వచ్చాయి. అయితే తొలి లిప్‌ కిస్‌ అన్నది మాత్రం ఇప్పటికీ అలాగే నిలిచిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్‌ ఇండస్ట్రీలో లిప్‌ లాక్‌లు చాలా కామన్. ఈ జనరేషన్ హీరోయిన్లు కిస్సింగ్ సీన్స్‌లో జీవించేస్తున్నారు. కానీ ఎర్లీ డేస్‌లో చేసిన లిప్‌ లాక్‌లో మాత్రం భార్య భర్తలైన దేవికా రాణి, హిమాన్షు రాయ్‌లు నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: