మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన హార్ట్ ఎటాక్ సినిమాలో నితిన్, అదా శర్మ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో నితిన్ వరుణ్ అనే అనాధ పాత్రలో నటించాడు. ఈ వరుణ్ స్పెయిన్ దేశంలో చిన్నా చితకా పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే స్పెయిన్ దేశానికి తన స్నేహితురాలిని కలిసేందుకు హయతి(అదా శర్మ) విచ్చేయగా... ఆమెను లైన్లో పెట్టడానికి వరుణ్ శతవిధాల ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎంత ప్రయత్నించినా ఆమె అతని వైపు చూడకపోవడంతో... హార్ట్ ఎటాక్ వచ్చినట్టు నాటకమాడి ఆమె నెంబర్ తీసుకుంటాడు.


ఐతే తన స్నేహితురాలైన ప్రియా ఒక ఆఫ్రికన్ మ్యూజిషియన్ ని ప్రేమిస్తుంది కానీ ప్రియ తండ్రి మాత్రం ఆమె ప్రేమను అంగీకరించడు. దాంతో ప్రియా తండ్రి ని ఒప్పించడానికి హయతి ప్రయత్నించి విఫలమవుతుంది. ఇది తెలుసుకున్న వరుణ్ తను ఆ అమ్మాయి తండ్రి ని ఒప్పిస్తానని హయతి తో అంటాడు. అలా ఒప్పిస్తే తనకు ముద్దు ఇవ్వాలనే కండిషన్ పెడతాడు. ఈ కండిషన్ కి హయతి ఒప్పుకుంటుంది. దీంతో ప్రియ తండ్రిని ఒప్పించి అదా శర్మ ని దాదాపు ఒక్క నిమిషం పాటు నితిన్ లిప్ కిస్ చేస్తాడు.


హార్ట్ ఎటాక్ సినిమాలో ఈ అదర చుబనమే హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఈ చిత్రం నితిన్ కెరియర్ ని మళ్ళీ గాడి లో పెట్టింది అని చెప్పుకోవచ్చు. బుట్టబొమ్మ లాగా కనిపించే అదా శర్మ నితిన్ తో రొమాన్స్ చేయడం తెలుగు ప్రేక్షకులతో పాటు హింది ప్రేక్షకులను కూడా ఆకర్షించింది. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించడంతో పాటు పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ కింద నిర్మాత బాధ్యతలన్నీ తానే చేపట్టాడు. ఈ సినిమాని రూ. 13.5 కోట్ల తో తెరకెక్కించ గా... 50 రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద రూ. 40 కోట్లు సంపాదించింది. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: