గొప్ప దర్శకుడు, రచయిత అయిన రాజ్ కుమార్ హిరానీ చిత్రాలు అందరినీ ఎంటర్టైన్ చేయడం తో పాటు ఆలోచింపచేసేలా ఉంటాయి. యువతను ఆకట్టుకునే హింది కామెడీ డ్రామా సినిమా అయిన 3 ఇడియట్స్ కేవలం 55 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 460 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ సినిమా చేతన్ భగత్ రాసిన ఫైవ్ పాయింట్ సమ్ వన్ నవల నుండి స్ఫూర్తిగా తీసుకొనబడింది. ఈ చిత్రంలో అమీర్ ఖాన్, మాధవన్, శర్మాన్ జోషి, కరీనాకపూర్ ప్రధాన పాత్రలలో నటించారు.


ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టం ఎంత చెత్త గా ఉందో తెలియజేయడమే ఈ సినిమా యొక్క సారాంశం. ఇదే సినిమాని తమిళ దర్శకుడు ఎస్. శంకర్ హీరో విజయ్ తలపథి, జీవా శ్రీకాంత్, ఇలియానా సత్య రాజ్ లతో తెరకెక్కించాడు. ఈ చిత్రం తెలుగులో కూడా డబ్ చేయబడింది. కాగా... హిందీ భాషలో ఒరిజినల్ 3 ఇడియట్స్ సినిమా ఎంతలా హిట్ అయ్యిందో ఇక్కడ కూడా అదే స్థాయిలో హిట్ అయ్యి దక్షిణాది ప్రేక్షకులను బాగా అలరించింది.


హింది లో ఆమీర్ ఖాన్ సరసన జీరో సైజు ముద్దుగుమ్మ కరీనా కపూర్ నటించగా... తమిళంలో విజయ్ సరసన ఇలియానా నటించింది. అయితే ఈ జంట మధ్య చోటు చేసుకున్న రొమాంటిక్ సన్నివేశాలు ఆయా భాషా ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా కరీనా కపూర్ ఆమీర్ ఖాన్ ను ముద్దు పెట్టుకున్న సన్నివేశం కుర్రకారుకి మతిపోగొట్టించిందని చెప్పుకోవచ్చు. ఈ చిత్రంలో కరీనా కపూర్ చాలా అందంగా కనిపించగా... క్లైమాక్స్ లో ఆమీర్ ఖాన్ కి అర నిమిషం పాటు అదర చుబనం ఇచ్చి ప్రేక్షకులకి సెగ పుట్టించింది. తమిళంలో కూడా ఇదే సన్నివేశంలో ఇలియానా విజయ్ కి అరనిమిషం పాటు లిప్ కిస్ ఇచ్చి అందరి ప్రేక్షకులను ఆశ్చర్య పరిచింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: