2015 నవంబర్ 20వ తేదీన విడుదలయిన కుమారి 21f చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఈ సినిమాని సుకుమార్ డైరెక్టు చేయడంతో పాటు ప్రొడ్యూస్ కూడా చేశాడు. నిజానికి స్క్రిప్టు కూడా తనే రాసుకున్నాడు. పూర్తి అడల్ట్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో రాజు తరుణ్ కథానాయకుడిగా... హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా భారీ హిట్ అయినప్పటికీ... సుకుమార్ అనేక విమర్శలకు బాధితుడయ్యాడు. ఎందుకంటే ఒరిజినల్ ఫిలిం గా చెప్పబడే ఈ సినిమా 2004వ సంవత్సరంలో ఫ్రెంచి భాషలో విడుదలైనా లీలా సేస్(lila says) నుండి కాఫీ కొట్టబడింది.


ఈ రెండు సినిమాల సన్నివేశాలు పక్కపక్కన పెట్టి చూసుకుంటే... కుమారి 21F మూవీ లీలా సేస్ సినిమాకి రీమేక్ అనిపిస్తోంది. ఏది ఏమైనా ఒక అద్భుతమైన కథను తెలుగు ప్రేక్షకులకు అర్థమయ్యేలా చూపించిన సుకుమార్ కు క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఈ సినిమా కథాంశం ఒక ఎత్తైతే... హీరోయిన్ క్యారెక్టర్ మరో ఎత్తు. ముంబైకి చెందిన మీనా కుమారి సిద్ధూ(రాజ్ తరుణ్) నివసిస్తున్న కెజిబి కాలనీ కి వస్తుంది. ఆ తర్వాత అతడితో లవ్ లో పడుతుంది. ఈ క్రమంలో వారి ఇరువురి మధ్య ఎన్నో లిప్ లాక్స్ జరుగుతాయి. ఐతే ఈ సన్నివేశాలలో హెబ్బా పటేల్ చాలా సహజంగా నటించి యువతకు చెమటలు పట్టించింది.


లిప్ కిస్ చేసేముందు స్మెల్ రాకుండా హాల్స్ వేసుకోవాలని మీనా కుమారి సిద్దు కి చెప్పే సన్నివేశం చాలా బోల్డ్ గా ఉంటుంది. ఇంకా వీళ్లిద్దరి మధ్య కొనసాగే హాట్ సన్నివేశాలు చాలా బోల్డ్ గా ఉంటాయి. హెబ్బా పటేల్ మీనా కుమారి అనే మెచ్యూరిటీ ఉన్న యువతి పాత్రలో జీవించేసిందని చెప్పవచ్చు. లిప్ కిస్ ఎలా చేయాలో ఒక రకంగా హెబ్బాపటేల్ నేర్పించింది అని సినిమా రిలీజ్ అయిన కొత్తలో ఎంతో మంది నెటిజన్లు కామెంట్లు చేశారు అంటే అతిశయోక్తి కాదు. ఏదేమైనా ఫీల్ గుడ్ మూడ్ తో ప్రారంభమైన కుమారి 21F విషాదకరమైన సంఘటన తో ముగుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: