లాక్ డౌన్ కదా.. ఏదో టైమ్ పాస్ చేద్దామని కాకుండా సల్మాన్ ఖాన్.. గుర్రాలతో ఆడుకున్నాడు, గడ్డితిన్నాడు , పాటలు పాడాడు, ఆ పాటని డైరెక్ట్ కూడా చేశాడు , తన ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ తో పాటు ఇంకొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ తో అసలు ఫామ్ హౌజ్ లో చాలా స్టోరీలు నడుపుతున్నాడు సల్మాన్ భాయ్.

 

ఏదో సరదాగా  టైమ్ పాస్ కి బ్రేక్ కోసం పాన్వెల్ ఫామ్ హౌజ్ కి వెళ్లిన సల్మాన్ ఖాన్..దాదాపు వన్ అండ్ హాఫ్ మన్త్ నుంచి అక్కడే ఉన్నారు .  ఎరక్కపోయి వచ్చాము మేము ఇరుక్కుపోయాము  అనుకోకుండా  ఈ 50 డేస్ నుంచి ఫుల్ గా  ఎంజాయ్ చేస్తున్నారు సల్మాన్ ఖాన్ అండ్ బ్యాచ్. గుర్రాలకు గడ్డిపెడుతూ.. ఆ గడ్డి అప్పుడప్పుడు సల్మాన్ కూడా తింటూ .. హ్యాపీ గా హాలీడే నిఎంజాయ్ చేస్తూ..ఫామ్ హౌజ్ లో రోజుకో స్టోరీ తో టైమ్ పాస్ చేస్తున్నాడు సల్మాన్ ఖాన్ ..ఈ లాక్ డౌన్ టైమ్ లో ఏదో ఊరికే టైమ్ పాస్  చెయ్యకుండా తన క్రియేటివిటీ చూపిస్తున్నాడు.

 

తన క్లోజ్ ఫ్రెండ్ అయిన జాక్విలిన్ తో  తేరే బినా పాట తీశాడు . తెరె బినా సాంగ్‌ని స్వ‌యంగా స‌ల్మాన్ పాడ‌డంతో పాటు డైరెక్ట్ చేశాడు.  ఈ పాట మొత్తం జస్ట్ ముగ్గురు కలిసి షూట్ చేశారు. నేచురల్ లొకేషన్స్ లో  పాన్వెల్ ఫాం హౌజ్‌లోనే  షూట్ చేసినఈ పాట లో జాక్విలిన్ , సల్మాన్ మంచి రొమాంటిక్ గా కనిపిస్తున్నారు.


 
సల్మాన్ ఖాన్ పాట తీయడమే కాదు .. తన  ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తున్నాడు . సల్మాన్ ఖాన్ ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్ లులియా వాంటుర్ తో కలిసి  గుర్రం స్వారీ చేస్తున్నాడు. లులియా కూడా నేను చాలా సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నాను.. ప్రజెంట్ నా చుట్టూ ఉన్న మనుషులతో, ఈ రిలేషన్ లో చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చింది.

 

తన గర్ల్ ప్రెండ్స్ తో నే కాదు ..అటు సోషల్ సర్వీస్ కరూడా చేస్తున్నాడు. దాదాపు లక్ష మందికి సరిపడా నిత్యావసర వస్తువుల్ని, సరుకుల్ని దగ్గరలో ఉన్న గ్రామాలకు , ప్రజలకు పంపించాడు సల్మాన్ ఖాన్ . తన ఫామ్ హౌజ్ లో పండిన వాటితో పాటు మిగిలిన వాటిని కూడా లాక్ డౌన్ తో ఇబ్బందిపడుతున్న వాళ్లకి సహాయం చేశాడు సల్మాన్ ఖాన్ . ఇలా ఒకటి కాదు .. అటు ఎంజాయ్ మెంట్ తో పాటు సర్వీస్ కూడా చేస్తూ..ఫామ్ హౌజ్ లో రోజురోజుకో  ఇంట్రస్టింగ్ స్టోరీతో లాక్ డౌన్ టైమ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు సల్మాన్ ఖాన్.

మరింత సమాచారం తెలుసుకోండి: