టాలీవుడ్ లో పూజ హెగ్డే కి అతి తక్కువ కాలంలో మంచి క్రేజ్ వచ్చింది అనేది వాస్తవం. ఆమె సినిమాలు అన్నీ కూడా ఈ మధ్య కాలంలో సూపర్ హిట్ అవుతున్నాయి. చిన్న హీరోలు పెద్ద హీరోలు అనే తేడా లేకుండా ఆమె సినిమాలు చేస్తుంది. ఆమె సినిమా ల కోసం ప్రేక్షకులు కూడా ఎదురు చూసే పరిస్థితి ఉంది ఇప్పుడు. ఆమె సినిమాలు అన్నీ కూడా స్టార్ హీరోలతోనే ఉన్నాయి ఈ మధ్య కాలంలో. అయితే ఆమె అఖిల్ తో ఒక్కడి తోనే ఆమె సినిమా చేస్తుంది. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆమె లిప్ లాక్ సన్నివేశాలకు రెడీ అవుతుంది. 

 

ఏ లిప్ లాక్ సీన్ లో అయినా సరే ఆమె నటించడానికి ఓకే అంటుంది అని సమాచారం. ఇక ఆమె ముందు బాలీవుడ్ లో ఆఫర్లు వచ్చిన సమయంలో లిప్ లాక్ సన్నివేశాలు నటించమని ఆమెను అడగగా ఆమె అంతగా ఆసక్తి చూపించలేదు. కాని కంగారు పడింది అని చెప్పింది కూడా. ఇప్పుడు అయితే అలాంటి పరిస్థితి లేదని ఆమె ఏ సీన్ కి అయినా సరే ఓకే చెప్తుంది అని అంటున్నారు. ఆమె వచ్చే ఏడాది చేసే సినిమాలు అన్నీ కూడా హాట్ గానే ఉంటాయి అని సమాచారం. వచ్చే ఏడాది ఆమె మూడు బాలీవుడ్ సినిమాలను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని అంటున్నారు. 

 

ఈ మూడు సినిమాల్లో కూడా ఆమె చాలా వరకు బోల్డ్ గా నటించాలి అని అంటున్నారు. ఈ మూడు సినిమాల్లో ఆమెకు భారీగా పారితోషికం ఇస్తున్నారు అని సమాచారం. ఇక ఆమె కెరీర్ లో ఈ సినిమాలు చాలా కీలకం అని అక్కడ గనుక అవి హిట్ అయితే ఆమె బాలీవుడ్ లోనే ఉండే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: