స్టార్ సినిమా అయినా.. స్మాల్ బడ్జెట్ సినిమా అయినా ప్రస్తుతం సినిమాల్లో లిప్ లాక్ అనేది సర్వసాధారణం అయ్యింది. పక్కాగా చెప్పాలంటే మూతి ముద్దు లేని సినిమాలు ఏవి అంటే వేళ్ళతో లెక్కబెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదివరకు స్టార్ సినిమాల్లో వాటికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించే వారు కాదు కానీ ఇప్పుడు వారు కూడా అవసరం అనుకుంటే లిప్ లాక్ సీన్స్ పెడుతున్నారు. కొంతమంది ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేసేందుకే ఈ లిప్ లాక్ సీన్స్ సినిమాలో ఉంచుతారు. 

 

అయితే లిప్ లాక్ సీన్స్ పెట్టినంత మాత్రాన సినిమాలు హిట్టు అవుతాయా అంటే.. ఈ సీన్స్ రెండు మూడు కలిపి టీజర్ వదిలితే సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ వచ్చేస్తుంది. ఇక థియేటర్ దాకా వచ్చిన ఆడియెన్ ను సినిమా సూపర్ అనిపించేలా చేయడమే దర్శక నిర్మాతల పని. అందుకే ఈమధ్య ప్రతి సినిమాలో లిప్ లాక్స్, హాట్ సీన్స్ చాలా కామన్ అనిపిస్తున్నాయి. ఎంగిలి ముద్దులు హిట్టు సినిమాకు సూత్రాలుగా మారాయంటే కొన్ని సినిమాలు చూస్తే అవుననక తప్పట్లేదు. అదేంటి ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్ బస్టర్స్, చరిత్ర సృష్టించిన సినిమాల్లో ఇలాంటివి ఏమి లేవు కదా అనుకోవచ్చు. అలాంటి సినిమాలు కాకుండా కొత్త దర్శకులు కొత్త టీమ్ తో చేసే ప్రయత్నంలో భాగంగా కథ కథనానికి సంబంధం లేకుండా ఎక్కడో ఒక చోట హీరో హీరోయిన్ లిప్ లాక్ యాడ్ చేస్తున్నారు. అది సినిమాకు ఏమాత్రం ఉపయోగపడకున్నా యూత్ ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసేందుకు అలాంటివి పెడుతున్నారు.

 

అయితే చిన్న సినిమాల్లో కూడా కంటెంట్ ఉన్న సినిమాలు ఈమధ్య బాగా వస్తున్నాయి. కొందరు తమ టాలెంట్ తో ఆశ్చర్యపరిచే కథ కథనాలతో వస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం లిప్ లాక్స్, హాట్ సీన్స్, హీరోయిన్ అందాల మీదే ఆధారపడుతూ రొటీన్ కథలతో పబ్బం గడుపుతున్నారు. అయితే అలాంటి సినిమాలు హిట్ అవ్వోచ్చేమో కానీ ఆ తర్వాత మాత్రం వారికి అవకాశాలు గొప్పగా రావని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: