లేడీ అంటే అన్ని క్యారెక్టర్స్ చెయ్యగలదు అని తెలుసు.. అయితే లేడీ నెగటివ్ రోల్ లో కొందరు మంచి సినిమాలు చేశారు. అయితే అందులో కొందరు లేడీ విలన్స్ హీరోయిన్స్ గా మెప్పించి విలన్ గా మనసుకు తాకినా వారు ఎంతో మంది ఉన్నారు. ఇంకా అలాంటి సూపర్ డూపర్ లేడీ విలన్స్ ఎవరో చూసి తెలుసుకోండి. 

 

రమ్య కృష్ణ.. 

 

నరసింహ సినిమాలో నీలాంబరి క్యారెక్టర్ ఇప్పటికి మరుపు రానిదే. హీరోకి తగ్గ స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇచ్చింది.. అప్పట్లో అసలు ఆ ఆటిట్యూడ్, స్టైల్, డైలాగ్ డెలివరీ ఇంకా ఎవరు చెయ్యలేరు అలా అని అనిపించేసింది. 

 

రాశి.. 

 

అప్పటి వరుకు సూపర్ హీరోయిన్ లా కనిపించి.. గోకులంలో సీతలా మెప్పించిన రాశి మహేష్ బాబు నిజం సినిమాలో విలన్ గా కనిపించి అందరిని మెప్పించింది. 

 

సుభాషిణి.. 

 

అరుంధతి సినిమాలో ఈమెని చూస్తే చాలు భయం వేస్తుంది. అలా ఉంటుంది ఆమె. డైలాగ్స్ లేకుండానే బయపెట్టేసింది. 

 

తెలంగాణ శకుంతల.. 

 

ఒక్కడు సినిమాలో ఈమె కనిపిస్తే చాలు అందరి ముఖాల్లో చిరునవ్వు వచ్చేస్తుంది.. విలనిజం ఉన్న సరే చివరిలో ఆ బాంబు సిన్ కి అందరూ పగలబడి నవ్వారు అంటే నమ్మండి. 

 

సరితా.. 

 

మహేష్ బాబు అర్జున్ సినిమాలో ఈమె భయటకు మంచి మహిళగా కనిపిస్తుంది.. లోపల మాత్రం విలనిజం బాబోయ్ అని అనిపిస్తుంది.. ఇలాంటి అత్త ఎవరికి ఉండకూడదు అని ఈ సినిమా చూస్తేనే అనిపిస్తుంది. 

 

యాంకర్ అనసూయ.. 

 

యాంకర్ అనసూయ.. క్షణం సినిమాలో స్టార్టింగ్ అంత మంచి పోలీస్ ఆఫీసర్ లా కనిపించింది.. చివరికి ఆమెనే విలన్.. శాడిస్ట్ లా కనిపించింది.. బాగా అలరించింది.                

మరింత సమాచారం తెలుసుకోండి: