రాశీ ఖన్నా.. పరిచయం అవసరం లేని పేరు. ఒకవైపు మత్తెక్కించే అందం.. మరోవైపు అందర్నీ ఆకట్టుకునే అభినయం.. ఈ రెండు ఉన్న అందాల చందమామ రాశీ ఖన్నా. హిట్టు, ప్లాప్‌లతో సంబంధం లేకుండా టాలీవుడ్లో రాశీఖన్నా అవకాశాలను దక్కించుకుంటుంది. ప్రస్తుతం టాలీవుడ్లో బిజీగా ఉన్న హీరోయిన్లలో రాశీ కూడా ఒకరు. `ఊహలు గుసగుసలాడే` సినిమాతో హీరోయిన్గా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన రాశీ ఖన్నా.. తొలి ప్రేమ చిత్రంతో మంచి ఇమేజ్ దక్కించుకుంది ఈ బ్యూటి. అప్పటి వరకూ కాస్త బొద్దుగా ఉంటూ.. గ్లామర్ పాత్రలు మాత్రమే చేస్తూ వచ్చిన రాశీ ఖన్నా లో ఇంత గొప్ప నటి ఉందా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది ఆ చిత్రం.
ఇక ఇటీవల రాశీ ఖన్నా వెంకీమామ, ప్రతిరోజూ పండుగే లాంటి రెండు మంచి హిట్లను ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తనకు మంచి విజయాన్ని ఇస్తుందని ఆ సినిమా కోసం ఎంత కష్టపడినా.. తనకి మాత్రం తను ఊహించిన విజయాన్ని ఆ చిత్రం ఇవ్వలేకపోయింది. అంతేకాదు.. ఈ సినిమాలో ఎన్నడూ లేనివిధంగా బోల్డ్ రోల్లో నటించింది సెన్సేషన్ సృష్టించింది. ఈ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండతో రాశీ ఖన్నా రెచ్చిపోయిందనే చెప్పాలి.
ఈ చిత్రంలో ఇందులో ఐశ్వర్య, ఇజాబెల్లా, కేథరీన్ థ్రెస్సాలు కూడా హీరోయిన్లుగా చేసినప్పటికీ ఎక్కువగా అందరి దృష్టినీ ఆకర్షించింది యామినిగా రాశీ పాత్రే. ముఖ్యంగా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో ఆమె టాప్ లెస్‌గా కనిపించడమే కాక, లిప్‌లాక్, రొమాంటిక్ సీన్లలో రెచ్చిపోయి.. అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనిపై సినీప్రియుల నుంచి కాస్త విమర్శలు ఎదురయ్యాయి. నెట్టింట రాశీపై ట్రోలింగ్ కూడా జరిగింది. ముఖ్యంగా రాశీ ఖన్నా ఫ్యాన్స్ విజయ్‌తో లిప్‌లాక్, బెడ్ సీన్ల గురించి గోల పెట్టేశారు. ఇక ఆ తర్వాత వాటిని రాశీ బాగానే కవర్ చేసుకొంది. ఏదేమైనప్పటికీ విజయ్‌తో రాశీ ఖన్నా లిప్‌లాక్ సీన్లు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు.