ప్రస్తుతం టాలీవుడ్ లో లిప్ లాక్ సీన్లు కామన్ గా మారిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అందరి హీరోల సినిమాల్లో లిప్ లాక్ సీన్లు దర్శనమిస్తున్నాయి. ఇక హీరోయిన్లు కూడా లిప్ లాక్ సీన్లు చేసేందుకు ఎక్కడ వెనకాడడం లేదు. పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి సీన్లలో అయినా నటించడానికి సిద్ధం అంటున్నారు. దీంతో కొందరు హీరోయిన్లు లిప్ లాక్ సీన్ లతో ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నారు అనే విషయం తెలిసిందే . హీరోయిన్ల గురించి పక్కన పెడితే ప్రస్తుతం స్టార్ హీరోలు కేవలం పాత్ర డిమాండ్ చేస్తే తప్ప లిప్ లాక్ సీన్లలో నటించడం లేదు.. యువ హీరోలు అయినప్పటికీ లిప్లాక్ సీన్లలో  నటించాలంటే కాస్త వెనకడుగు వేస్తున్నారు. 

 

 

 కానీ ఐదు పదుల వయస్సు దాటిన పోతున్న టాలీవుడ్ ఎవర్గ్రీన్ మన్మధుడు గా కొనసాగుతున్న నాగార్జున మాత్రం ఇంకా లిప్ లాక్ సీన్లలో నటిస్తూ  అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు. అది కూడా ఏదో తూతూ మంత్రంగా ఉండే లిప్ లాక్ సీన్ కాదు.. యువ హీరోలకు సైతం సాధ్యం కానీ డీప్ లిప్ లాక్ సీన్లలో నటిస్తున్నారు నాగార్జున. తాజాగా నాగార్జున హీరోగా తెరకెక్కిన చిత్రం మన్మధుడు 2. ఈ సినిమాలో ప్లే బాయ్ పాత్రలో నటించిన నాగార్జున... తన లిప్ లాక్ సీన్ లతో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. 

 

 

 మాములుగా  అయితే యువ హీరోలు తమ సినిమాల్లో లిప్ లాక్ సీన్లలో నటించడం చేస్తూ ఉంటారూ.  అదే సీనియర్ హీరోలు అయితే కాస్త మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ ఉంటారు. కానీ ఇద్దరు కొడుకులు టాలీవుడ్ లో హీరోలుగా కొనసాగుతున్నప్పటికీ.. ఐదు పదుల వయస్సు దాటి పోతున్నప్పటికీ... యువ హీరోలను సైతం తలదన్నే విధంగా లిప్ లాక్ సీన్లలో నటించాడు నాగార్జున. డీప్ లిప్ లాక్ సీన్లలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అంతేకాదు ఇలాంటి లిప్ లాక్ సీన్లలో నటించి కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు నాగార్జున

మరింత సమాచారం తెలుసుకోండి: