బిపాసా బసూ... బాలీవుడ్ ని ఒక ఊపు ఊపిన హీరోయిన్. ఏ హీరో సినిమా అయినా సరే ఈమె ఉంది అంటే చాలు సినిమా హిట్ అనే భావన కూడా ఉండేది కొన్ని రోజులు. ఇక ఆ సినిమాలో ఆమె ఒక్కరే హైలెట్ అయ్యే వారు అనేది కూడా వాస్తవం. హీరో ని ఆమె నటన తో డామినేట్ చేస్తూ ఉండేది బిపాసా అనేది వాస్తవం. ఆమె నటిస్తుంది అంటే హాట్ సన్నివేశాల్లో హీరోలు చాలా ఇబ్బంది పడే వారు అని చెప్తూ ఉంటారు. అది నిజమా కాదా అనేది పక్కన పెడితే ఆమె తో నటించాలి అంటే గట్స్ ఉండాలి అని హీరోలు చెప్పిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి అనేది తెలిసిందే. 

 

ఇక అది అలా ఉంటే... ఆమె లిప్ లాక్ ల విషయంలో ఏ మాత్రం కూడా భయపడేది కాదు అనేది వాస్తవం. ఆమె లిప్ లాక్ సన్నివేశాలు ఇప్పటికి కూడా బాలీవుడ్ లో సంచలనమే. జాన్ అబ్రహం తో ఆమె ఇచ్చిన లిప్ లాక్ సన్నివేశాలు ఒక సంచలన౦. ఆ విధంగా ఆమె బాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపు ని లిప్ లాక్ విషయంలో సంపాదించుకుంది. ఆమె నటనకు కూడా మంచి మార్కులే పడేవి అప్పట్లో. బాలీవుడ్ లో ఆమె తో సినిమా చేయడానికి చాలా మంది హీరోలు కొన్ని రోజుల పాటు పోటీ పడిన సందర్భాలు కూడా ఉన్నాయి అనేది తెలిసిందే. 

 

ఇక అది పక్కన పెడితే ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. భర్త తో కలిసి లైఫ్ ని ఆమె ఎంజాయ్ చేస్తుంది. ఆమె సినిమాలు అన్నీ కూడా మంచి విజయాలు సాధించాయి. ఇక హాలీవుడ్ లో కూడా ఆమెకు ఆఫర్లు వచ్చినా ఇక్కడే ఆగిపోయింది ఆమె.

మరింత సమాచారం తెలుసుకోండి: