తెలుగు చిత్ర పరిశ్రమలో నిధి అగర్వాల్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన హాట్ హాట్ అందాలతో ఇప్పటికే ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకుంది  ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. అయితే ప్రస్తుతం లాక్ డౌన్  సమయం కావడంతో సినిమా షూటింగ్ లు అన్నీ నిలిచిపోవడంతో సినీ సెలబ్రిటీలు అందరూ ఇంటికే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో ఎప్పుడు బిజీ బిజీగా ఉండే సినీ  సెలబ్రేటీలు  తాజాగా కాళీ అవడంతో సరికొత్తగా ఏదో ఒకటి ట్రై చేస్తున్నారు. 

 

 ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలరించడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిధి అగర్వాల్ కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చింది. అంతేకాదండోయ్ లాక్ డౌన్ సమయంలో చాలా ఖాళీ సమయం దొరకడం తో తాను పబ్జి గేమ్ కి ఎక్కువగా అలవాటు పడిపోయాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఎక్కువ సమయాన్ని పబ్జి గేమ్ ఆడటానికి కేటాయిస్తున్నాను  అంటూ తెలిపింది. 

 

 

 ఇక తాజాగా ఇటీవలె అభిమానులతో ముచ్చటించిన వీడియోని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ... పబ్జి ఆడుతున్నాను అనే విషయాన్ని బయట పెట్టేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక తన రూం ఉండే ఈ లైవ్ చాట్ లో పాల్గొన్న నిధి అగర్వాల్... లైవ్ చాట్ లో పబ్జి ఆడుతూ నెటిజన్లకు దొరికిపోయింది. దీంతో మీకు పబ్జి ఆడే అలవాటు ఉందా అని నెటిజన్లు ప్రశ్నించగా ఈ మధ్యకాలంలో బాగా అలవాటైందని ... ఎక్కువ సమయం పబ్ జీ కి  కేటాయిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: