కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న లాక్ డౌన్ చర్య వల్ల థియేటర్లు మొత్తం మూతపడ్డాయి. ముఖ్యంగా గుంపులు గుంపులు గా ఉండే చోటా ఈ మహమ్మారి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక థియేటర్లలో మాత్రమే కాదు షాపింగ్ మాల్స్ ఇంకా ప్రజలు ఎక్కువ గుమ్ముడు స్థలాలు మొత్తం అన్ని ప్రపంచ వ్యాప్తంగా బంద్ అయిపోయాయి. ఈ చర్యతో సినిమా థియేటర్ల యాజమాన్యాలు తల బాదుకున్నా పరిస్థితి ఏర్పడింది. కాగా ఇటీవల వైరస్ ప్రభావం తగ్గడంతో దేశంలో చాలా వాటికి కేంద్రం మినహాయింపులు ఇస్తున్న కానీ సినిమా థియేటర్ల విషయంలో మాత్రం చాలా కఠినంగా వ్యవహరించబోతున్నట్లు పరిస్థితి బట్టి అర్థమవుతుంది.

 

మరోపక్క ప్రజలలో కూడా సినిమా థియేటర్ లోకి వెళితే కరోనా వైరస్ ఈజీగా సోకుతుంది అన్న భయాందోళనలో ఉన్నారు. దీంతో ఇటువంటి పరిస్థితిని అధిగమించడానికి ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు సినిమా థియేటర్ల యాజమాన్యాల సంఘం మధ్య తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం కి అదిరిపోయే ఆలోచన చేశారు. అదేమిటంటే ఇకనుండి సినిమా థియేటర్ లోనే మద్యం తాగే అవకాశం కల్పించే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు దీని గురించి ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరిగినట్లు ఫిలింనగర్ లో టాక్.

 

ఇదే గనుక నిజమైతే చాలా వరకూ మందుబాబులు థియేటర్లకు పోటెత్తడం గ్యారెంటి. అయితే ఈ విషయంలో కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశం ఉండదని మరోపక్క ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో థియేటర్లోనే మద్యం తాగే అవకాశాన్ని కల్పించడానికి అటు ఇండస్ట్రీ పెద్దలు ఇటు థియేటర్ల యాజమాన్యాలు ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇలాంటి సంస్కృతి ఇప్పటికే విదేశాలలో ఉంది. ఇటువంటి చర్య వల్ల అటు ప్రభుత్వాలకు కూడా ఆదాయాలు వచ్చే అవకాశం ఉండటంతో ఇండస్ట్రీ పెద్దలు ప్రభుత్వాలతో మంతనాలు జరపడానికి రెడీ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: