కేంద్రం తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయానికి దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమ సినిమా షూటింగులు రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. వేసవి సీజన్ కావటంతో దేశవ్యాప్తంగా అన్ని సినిమా ఇండస్ట్రీలో ఈ వేసవి సీజన్ కి విడుదల కావాల్సిన సినిమాలు చాలా వరకు రెడీ అయ్యాయి. కరెక్ట్ గా ఎగ్జామ్స్ మొత్తం అయినా ఈ సమయంలో ఒక్కసారిగా కరోనా వైరస్ దేశంలో ప్రవేశించడంతో కేంద్రం లాక్ డౌన్ విధించడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎక్కడికక్కడ సినిమా షూటింగులు క్లోజ్ చేసుకుని ఇంటికి పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. లైట్ మ్యాన్ మొదలుకొని స్టార్ హీరో డైరెక్టర్ వరకు అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో సినిమాకి పెట్టుబడి పెట్టిన నిర్మాతలు బాగానే నష్ట పోతుండగా వారందరి కంటే ఎక్కువగా ఈ సమయంలో ఫ్రస్ట్రేట్ అవుతోంది మ్యూజిక్ డైరెక్టర్ లట.

 

లాక్ డౌన్ వాళ్ళ మ్యూజిక్ డైరెక్టర్లకు మాత్రం నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుందట. దాదాపు అందరు సంగీత దర్శకులకు వారి సొంత రికార్డింగ్ స్టూడియోలు ఉన్నాయి. కాబట్టి, దర్శకులు తమ ఇంటి వద్దకు చేరుకుంటున్నారు. దీంతో ఒక పాటకు మించి మరొక పాట బాగా చేయాలని సిట్టింగులు మీద సిట్టింగులు ఒక సాంగ్ కోసం జరుగుతున్నాయట. దీంతో మ్యూజిక్ డైరెక్టర్ లకి నిద్రలేని రాత్రులు లాక్ డౌన్ టైం లో ఏర్పడుతున్నట్లు ఎక్కువ ఫ్రస్ట్రేట్ అవుతున్నట్లు సమాచారం.

 

టాలీవుడ్ ఇండస్ట్రీలో హైదరాబాదు లోనే ఎక్కువ డైరెక్టర్లు ఉండటంతో మ్యూజిక్ డైరెక్టర్లు ఛాన్స్ దొరికితే చెన్నై కి వెళ్లి పోవడానికి ప్రయత్నాలు జరుపుతున్నారట. డైరెక్టర్ గోల్ల పడలేక చాలా మంది ఈ విధంగానే వ్యవహరిస్తున్నారు. అంతే కాకుండా త్వరగా షూటింగులు మొదలవ్వాలని, డైరెక్టర్లు అంత పనిలో నిమగ్నం అవ్వాలని మ్యూజిక్ డైరెక్టర్ లు ప్రార్థిస్తున్నరట. మరో పక్క కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పుడు అప్పుడే సినిమా షూటింగ్ లకు పర్మిషన్ ఇచ్చే అవకాశం లేదని అంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: