మన తెలుగులో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ సినిమాలు అనగానే అభిమానులు ఏ స్థాయిలో ఎదురు చూస్తారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా వస్తుంది అంటే చాలు ఒకరకంగా అభిమానులకు పండగ అనేది వాస్తవం. ఇప్పుడు ఆయన మూడు సినిమాలను చేస్తున్నారు. ఈ మూడు సినిమాలు కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మూడు సినిమాల విషయంలో కూడా పవన్ కళ్యాణ్ ఇప్పుడు డేట్స్ ఇచ్చేసారు. 

 

అయితే ఈ మూడు సినిమాల విషయంలో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు అని సమాచారం. అది ఏంటీ అనేది ఒకసారి చూస్తే... ముందు పవన్ కళ్యాణ్... వకీల్ సాబ్ సినిమా పూర్తి అయిన తర్వాత మరో సినిమాను చెయ్యాలని భావిస్తున్నారు. వాస్తవానికి వకీల్ సాబ్ చేస్తూనే ఆయన క్రిష్ దర్శకత్వంలో సినిమాను పూర్తి చెయ్యాలని భావించారు. కాని ఇప్పుడు పరిస్థితులు ఆ విధంగా లేవు కాబట్టి ఆయన ఈ విషయంలో వెనక్కు తగ్గే ఆలోచనలో ఉన్నారు అని సమాచారం. నిర్మాతలకు దర్శకులకు ఏ విధంగా కూడా ఇబ్బంది లేకుండా నిర్ణయం తీసుకోవాలని ఆయన భావిస్తున్నారు. 

 

ఇప్పుడు ఆయన నిర్మాతలతో ఇదే విషయాన్ని చర్చించారు. ఒక సినిమా అయిన తర్వాత ఒక సినిమా చేద్దాం అని కావాలి అంటే అడ్వాన్స్ ని తాను వెనక్కు ఇస్తాను అని చెప్పినట్టు సమాచారం. ఎవరూ కూడా ఎక్కడా ఇబ్బంది పడవద్దు అని తాను అండగా ఉంటాను అని ఆయన చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఎవరూ కూడా ఆర్ధికంగా ఇబ్బంది పడవద్దు అని పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ తో సినిమా చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి టాలీవుడ్ లో.

మరింత సమాచారం తెలుసుకోండి: