మన తెలుగులో డాన్స్ బాగా చేసే నటుల్లో అల్లు అర్జున్ ఒకరు ఆయన సినిమాల్లో డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ఏది అయిన ఎలాంటి సినిమా అయినా సరే ఆయన డాన్స్ ఉంటే చాలు సినిమాలో మాస్ కి దగ్గర అయ్యే విధంగా ఉంటుంది అని అంటున్నారు. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు బాలీవుడ్ లో కొందరు హీరోలు బన్నీ ని సంప్రదించారు అని సమాచార౦. అది ఏంటీ అంటే తెలుగులో కేరళ లో బాబు కి ఉన్న ఫాలోయింగ్ తెలిసిన ఒక ఇద్దరు హీరోలు తమ సినిమాలో తమ తో కలిసి ఒక సాంగ్ చెయ్యాలి అని అడిగినట్టు సమాచారం. 

 

షాహిద్ కపూర్ ఇటీవల బన్నీ డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాడు. ఇప్పుడు అతను తన సినిమాలో సాంగ్ చేయించడానికి గానూ బన్నీ ని అడిగినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ జనాలు అంటున్నారు. మరి ఏ సినిమాలో చేస్తాడు అనేది తెలియదు గాని త్వరలోనే అతనికి ఒక ఫోన్ చేసి అడిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది అని సమాచారం. 

 

టాలీవుడ్ లో ఈ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ కూడా. ఈ సినిమాలో బన్నీ పాత్ర ఏ విధంగా ఉంటుంది అనేది ఆసక్తిగా ఉంది. ఇప్పటికే సినిమాలో బన్నీ ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేసారు. ఆ లుక్ కి అభిమానులు ఫిదా అయిపోయారు. మరి ఎప్పుడు ఈ సినిమా వస్తుందో గాని ఈ సినిమా కోసం సుకుమార్ కూడా చాలా కష్టపడుతున్నాడు అని అంటున్నారు. ఆయన సినిమాలో నటిస్తారు అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: