కరోనా వైరస్ దెబ్బకి దేశవ్యాప్తంగా తో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా సినిమా హాల్స్ మొత్తం క్లోజ్ అయిపోయాయి. చైనా దేశంలో ఈ వైరస్ బయటపడటంతోనే హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు సమ్మర్ లో రిలీజ్ కావాల్సిన సినిమాలను వాయిదా వేశారు. ప్రీ రిలీజ్ వేడుకలు జరగాల్సిన సినిమాలు కూడా అర్ధాంతరంగా ఆపేశారు. ఇదే సమయం లో వైరస్ ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందడంతో ప్రపంచ దేశాలు చాలావరకు లాక్ డౌన్ ప్రకటించాయి. ఇండియాలో కూడా ఈ వైరస్ విజృంభించడంతో మార్చి చివరి వారంలో లాక్ డౌన్ అమలు లోకి తీసుకు రావడంతో సినిమా షూటింగులు మొత్తం అంతా బంద్ అయిపోయాయి. అన్ని ఇండస్ట్రీలో ఉన్న సినిమా హీరోలు ఇళ్ల కే పరిమితమయ్యారు. ఇదిలా ఉండగా సినిమా థియేటర్లు దేశంలో ఓపెన్ అవటం కష్టమే అన్న వార్తలు కేంద్రం నుండి వినబడుతున్నాయి.

 

ప్రజలు గుంపులు గుంపులుగా ఉండేచోట ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటం తో పాటు ఇతరులకు ఎక్కువగా చూసే అవకాశం ఉండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా థియేటర్ల యాజమాన్యాలు షాకిచ్చేలా ప్రభుత్వాల నిర్ణయాలు ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం కొంత సానుకూలంగా ఉన్నాగాని తెలంగాణ ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక రంగానికి గుండెకాయ లాంటి హైదరాబాద్ నగరంలో ఇటువంటి రిస్క్ తీసుకునే ఉద్దేశం లేదని తెలంగాణ సర్కార్ డిసైడ్ అయిందట.

 

ఈ నేపథ్యంలో సినిమాటోగ్రఫీ మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంకా రెండు మూడు నెలలు సినిమా హాలు తెరుచుకునే అవకాశం లేదని పరిస్థితులు తీవ్రంగా ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియాకి చెప్పుకొచ్చారు. మొత్తంమీద చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడు సినిమాలు రిలీజ్ చేయాలని ఇండస్ట్రీ వాళ్లు అనుకుంటున్నారట. ఏపీ ప్రభుత్వం ఓకే అయిన మరోచోట నష్టం వచ్చే అవకాశం ఉండటంతో ఇండస్ట్రీ వాళ్లు కూడా లేట్ గానే సినిమాలు రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. సో రెండు మూడు నెలల వరకు సినిమా థియేటర్ లు ఓపెన్ అయ్యే అవకాశం లేదు అన్నట్లు స్పష్టంగా అర్థం అవుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: