రాం చరణ్. మెగాస్టార్ ముద్దుల తనయుడు. అంతే కాదు ఆయన నట వారసుడు. తండ్రికి తగిన కొడుకుగా తెలుగు ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. టాప్ రేంజి హీరోగా చరణ్ ఓ వైపు రికార్డులు స్రుష్టిస్తున్నాడు. మరో వైపు తన తండ్రి రీ ఎంట్రీ తరువాత మెగాస్టార్ కి ఏకైక  నిర్మాతగా మారిపోయారు.

 

చిరంజీవి రీ ఎంట్రీ తరువాత తీసిన రెండు సినిమాలు చరణ్ తన సొంత బ్యానర్లో తీసినవే. ఇక మూడవ సినిమా ఆచార్య కూడా మరో నిర్మాణ సంస్థ భాగస్వామ్యం ఉన్నా చరణ్ కూడా దానికి నిర్మత‌గా ఉన్నారు. ఇపుడు చిరంజీవి నాలుగవ సినిమా విషయంలోనూ చరణ్ పడుతున్న తాపత్రయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

 

మళయాళంలో సూపర్ హిట్ అయిన లూసీఫెర్ రీమేక్ రైట్స్ కొనేసిన చరణ్ తన తండ్రితో ఆ మూవీని  సొంత బ్యానర్లో తీయడానికి రెడీ అయిపోయాడు. ఇక ఈ మూవీ విషయంలో డైరెక్టర్ గా సుజిత్ ని కూడా చరణ్ సెలెక్ట్ చేసి తెలుగు నేటీవిటీకి తగినట్లుగా మూవీ చేయమంటున్నాడుట.  ఇక ఈ మూవీ తెలుగులో మంచి హిట్ అవుతుందని భావిస్తున్నారు.

 

సరే ఇవన్నీ ఇలా ఉంటే చరణ్ కి తండ్రి ప్రేమ ఎక్కువగా ఉందని, తన సినిమాలు, తన కెరీర్ చూసుకోవడంలేదని అంటున్నారు. చరణ్ ఇపుడు ఆర్.ఆర్.ఆర్ మూవీలో చేస్తున్నాడు. చరణ్ తరువాత సినిమా ఏంటి అంటే చెప్పలేరు. అదే ఆర్.ఆర్.ఆర్ లో నటిస్తున్న జూనియర్ ఎన్టీయార్ తరువాత సినిమాగా త్రివిక్రం డైరెక్షన్లో మూవీని లైన్లో పెట్టేశాడు.

 

 

చరణ్ మాత్రం చిరంజీవి ఆచార్య మూవీ సెట్స్ మీద ఉండగా మరో సినిమాను తండ్రికి సెట్ చేశాదు. ఇక తాను ఆచార్య సినిమాలో చిన్న పాత్ర పోషిస్తున్నాడు. తన తరువాత సినిమా మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు.  దీని మీద ఫ్యాన్స్ లో కొంత డిసప్పాయింట్మెంట్ ఉందిట. చరణ్ సినిమాలు వరసగా చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

 

చరణ్ చూస్తే ఆర్.ఆర్.ఆర్ కి లాక్ అయిపోయారు. అంతే కాదు, నిర్మాతగా బిజీగా ఉంటున్నారు. చరణ్ కి ఎంతో ఫ్యూచర్ ఉందని, దానికి తగినట్లుగా కెరీర్ ని మలచుకోవాలని సూచిస్తున్నారు. మరి చరణ్ తన కొత్త సినిమాలు ఎపుడు చెబుతారా అని అంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. చరణ్ కాస్తా తన గురించి కూడా ఆలోచించి సినిమాలను ప్లాన్ చేసుకోవాలని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: