అలా మొదలైంది, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి సినిమాలతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న బ్యూటీ  నిత్యామీనన్.. ఆమె ఏ సినిమాలో అయినా.. పాత్ర చిన్నది అయినా పెద్దది అయినా చేసింది అంటే ఆ పాత్ర జీవించేస్తుంది అంటే నమ్మండి. 

 

నిజానికి ఆ సినిమాలో నిత్యామీనన్ పాత్ర అంత గొప్పగా రాయకపోయిన సరే.. ఆమె నటనతో అందరిని ఆమె వైపుకు తిప్పేసుకుంటుంది నిత్య మీనన్. అంత గొప్ప నటి నిత్యామీనన్. చెప్పాలంటే ఆమె నటన వల్లే చాలా సినిమాల్లో పాత్రలకు రెక్కలు వచ్చాయి.. హీరోయిన్ అంటే ఏదో నటించడం.. నాలుగు పాటల్లో కనిపించడం అనేది కాకుండా ఆమెకు ఇచ్చిన పాత్రలో జీవించేసింది నిత్య మీనన్. 

 

ఇలా అన్ని పాత్రల్లో అద్భుతంగా నటించే బ్యూటీకి నటన పరంగా ఎంత పట్టు ఉందో.. అంతే పొగరు కూడా ఉందట.. నిత్య మీనన్ పొగరుబోతు నటి అని చేరన్ అనే ఓ తమిళ దర్శకుడు చెప్పుకొచ్చాడు. నిత్య  మీనన్, శర్వానంద్ హీరో హీరోయిన్లుగా ఓ తమిళ చిత్రంలో నటించారు.. ఆ సినిమాకు దర్శకత్వం వహించిన చేరన్ అనే దర్శకుడు ఆ సినిమా ఫస్ట్ లుక్ కార్యక్రమంలో ఆమెపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 

ఆ కార్యక్రమంలో ఆమెను పొగుడుతూనే ఆమెను తిట్టేశాడు ఆ దర్శకుడు.. ఆమెలో ఎంత మంచి నటి ఉందో అంతే పొగరు కూడా ఉంది అని.. ఆమె పొగరుబోతు బ్యూటీ అని అతను సరదాగా అన్నాడు. నిజానికి ఆ దర్శకుడు సరదాగా అన్నప్పటికీ ఆమెను నిజంగానే తిట్టాడు అని టాక్.. ఆమె చేసిన ఎన్నో సినిమాల్లో దర్శక నిర్మాతలు ఆమె సెట్స్ లో ఉండే తీరును భరించలేకపోయేవారానికి అప్పుడెప్పుడో ఓ ఆంగ్ల పత్రికలో కూడా ప్రచురితమైంది.. అయినా.. హీరోయిన్ అన్నాక ఆ మాత్రం పొగరు లేకపోతే ఎవరు పట్టించుకోరు లెండి.. ఇంకా ఎక్కువ పొగరు ఉన్న పట్టించుకోరు.. అలానే నిత్యామీనన్ కి అవకాశాలు తగ్గాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: