జెనిలియా... అతి తక్కువ కాలంలో మన తెలుగులో మంచి హిట్ అయిన హీరోయిన్. చాలా తక్కువ సినిమాలే చేసినా సరే చిన్న హీరోలతో మాత్రమే సినిమాలు చేసినా సరే ఆమెకు మాత్రం ప్రత్యేకంగా ఒక గుర్తింపు ఉంది అనేది వాస్తవం. ఆమెకు తెలుగులో అవకాశాలు ఇచ్చిన దర్శక నిర్మాతలు అందరూ కూడా ఆమెను ఒక రేంజ్ లో చూసారు. ఏ మాత్రం స్కిన్ షో చేయకుండా చాలా జాగ్రత్తగా సినిమాలు చేయడం వాటిని ఆమె ప్రమోషన్ చేసుకున్న తీరు అన్నీ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి అనేది వాస్తవం. ఆమె చేసిన సినిమాలు ఎక్కువగా హిట్ అయ్యాయి కూడా. 

 

మంచు విష్ణు రామ్ సహా కొందరు హీరోలతో ఆమె సినిమాలు చేసింది. ఇక రామ్ చరణ్ పక్కన కూడా ఆమె సినిమా చేసింది. ఈ సినిమా ఫ్లాప్ అయినా సరే ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. మంచు విష్ణు తో ఒక సినిమా చేయగా ఆ సినిమా బాగా హిట్ అయింది. ఇక సిద్దార్థ తో చేసిన బొమ్మరిల్లు సినిమా ఆమెకు మంచి పేరు తీసుకుని వచ్చింది అనేది వాస్తవం. ఆమె తెలుగులో బిజీ అవుతుంది అని చాలా మంది భావించారు గాని ఆమె తెలుగులో ఆఫర్లు ఉన్నా సరే వాటిని నిలబెట్టుకోవడం లో ఘోరంగా విఫలం అయింది అని కామెంట్ లు కూడా చేసారు. 

 

అయితే భర్త బాలీవుడ్ లో స్టార్ హీరో కావడం తో ఆమె అక్కడ ఎక్కువగా ఫోకస్ చేసింది అని అందుకే అక్కడికి వెళ్లిపోయింది అని మరికొందరు అన్నారు. ఆమె కు అసలు తెలుగు మీద ఆసక్తి లేదని ముందు ఉండి వచ్చినా సరే ఆ తర్వాత బాలీవుడ్ వెళ్లిపోవాలి అని అనుకుంది అని కొందరు కామెంట్స్ చేసారు. ఆమె అక్కడికి వెళ్లి రితేష్ ని పెళ్లి చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: