ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో అంతా లాక్ డౌన్ గంద‌ర‌గోళం నెల‌కొంది. స్టార్ హీరోల నుంచి మీడియం రేంజ్ హీరోల వ‌ర‌కు.. ఇక అటు ద‌ర్శ‌కులు.. నిర్మాత‌లు ఇప్ప‌ట్లో సినిమా షూటింగ్ లు జ‌రిగే ఛాన్సులు లేక‌పోవ‌డంతో ఏం చేయాలా ? అని త‌ల‌లు ప‌ట్టుకుని మ‌రీ వెయిట్ చేస్తున్నారు. వాస్త‌వంగా చూస్తే పెద్ద హీరోల‌కు.. ఓ మోస్త‌రుగా సెటిల్డ్ అయిన హీరోల‌కు ప‌ర్వాలే దు గాని... మిగిలిన చిన్న హీరోలు... స‌రైన హిట్ లేక ఏదైనా మంచి సినిమా ప‌డితే బాగుండు... కెరీర్ కాస్త స్వింగ్ అవుతుంద‌ని ఆశ‌ల‌తో ఉన్న హీరోలను ఇప్పుడు క‌రోనా లాక్ డౌన్ వెంటాడు తోంది. ఇక ఈ క‌రోనాకు ముందు వ‌ర‌కు ఇలాంటి హీరోల‌కు ఛాన్సులు ఇచ్చేందుకు రెడీ అయిన నిర్మాత‌లు.. వీరితో సినిమాలు చేసేందుకు ఆస‌క్తితో ఉన్న ద‌ర్శ‌కులు ఇప్ప‌ట్లో ముందుకు వ‌చ్చే ఛాన్సులు లేవంటున్నారు.

 

ఇక ఇప్పుడు షూటింగ్ లు తిరిగి స్టార్ట్ అయినా స‌రైన మార్కెట్ లేని హీరోల‌తో సినిమాలు చేసి ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో బిజినెస్ చేసుకోలేక న‌ష్ట‌పోవ‌డం ఎందుక‌న్న‌దే వీరి ఆలోచ‌న‌గా తెలుస్తోంది. ఇక థియేట‌ర్లు ఓపెన్ అయినా గ‌తంలో జ‌రిగినంత బిజినెస్ జ‌ర‌గ‌దు.. ఇక థియేట‌ర్లో సిటింగ్ కెపాసిటీ కూడా త‌గ్గించేస్తారు. అందుకే ఇప్పుడు మీడియం రేంజ్ హీరోల‌కు గ‌డ్డు ప‌రిస్థితులు త‌ప్పేలా లేవు. క‌నీసం ఓ యేడాది పాటు వీరితో ఎవ‌రైనా సినిమాలు చేసేందుకు ముందుకు రాని ప‌రిస్థితి. 

 

కొంద‌రు వెబ్ సీరిస్‌లు చేసుకుందామ‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట‌. ఇక యంగ్ హీరో శ‌ర్వానంద్‌కు గ‌త కొన్నేళ్లుగా స‌రైన హిట్ లేదు. అంతెందుకు శ‌ర్వా ఈ యేడాది స‌మంత‌తో చేసిన రీమేక్ జాను కూడా అట్ట‌ర్ ప్లాప్ అయ్యింది. ఇక ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో శ‌ర్వా మ‌రో యేడాది పాటు సినిమాల‌కు దూరంగా ఉంటే మంచిద‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.  మ‌రి ఇందులో వాస్త‌వం ఏంటో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: