కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తుండటంతో సెలబ్రెటీలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అనుకోకుండా వచ్చిన ఈ హాలిడేస్ ని రకరకాలుగా వాడుకుంటున్నారు. సినిమాలతో ఎప్పుడు బిజీగా ఉండే హీరోహీరోయిన్లు తమకు దొరికిన ఈ అవకాశంతో కుటుంబంతో హాయిగా గడిపేస్తున్నారు. ఫ్యామిలీతో మిస్ అయిన సమయాన్ని అంతా ఇప్పుడు కవర్ చేసుకుంటున్నారు. కొత్త కొత్త ఛాలెంజ్ లకు శ్రీకారం చుడుతూ కాలం వెలిబుచ్చుతున్నారు. ఇంట్లో చేసే వంటల వీడియోలను.. హోమ్ వర్క్ ఔట్ వీడియోలను..టిక్ టాక్ వీడియోలను.. డ్యాన్స్ వీడియోలను.. ఫోటోలను సోషల్ మీడియా పోస్ట్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నారు. మొత్తం మీద ఇంట్లోనే ఖాళీగా కూర్చున్న సెలబ్రిటీలు అభిమానులకు వినోదాన్ని పంచుతున్నారు. కొందరు సెలబ్రెటీలు మాత్రం ఇన్ని రోజులు తమలో దాగున్న ఇతర నైపుణ్యాలను బయటపెడుతున్నారు. మరికొందరు కరోనా వల్ల కావాల్సినంత సమయం దొరకడంతో వారి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొనే పనిలో పడ్డారు. చిన్నప్పటి నుండి నేర్చుకోవాలని సమయం దొరక్క వదిలేసిన వాటిని ఇప్పుడు ఈ కరోనా హాలిడేస్ లో నేర్చుకోడానికి ట్రై చేస్తున్నారు. 

 

టాలీవుడ్ ప్రముఖులు  ప్రేక్షకుల కోసం ఇంటర్వ్యూలు ఇస్తూ ఆడియన్స్ ను మెప్పిస్తున్నారు. కానీ మన యంగ్ హీరోలు రాహుల్ విజయ్, ఆకాష్ పూరి కలిసి పూరి డైలాగ్ లకి యాక్షన్ చేస్తూ #RahulCallsAkash వీడియో చేశారు. రాహుల్ విజయ్, ఆకాష్ పూరీకి ఫోన్ చేయడంతో మొదలైన ఈ వీడియో పూరి సినిమాల్లోని ఫేమస్ డైలాగులతోనే సాగుతుంది. ‘బుజ్జిగాడు’లోని ప్రభాస్ చెప్పే ‘ఏండి.. ఏమైనా మాట్లాడండి’ డైలాగుతో స్టార్ట్ అయి పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్, నాగార్జున, మహేష్ బాబు, అల్లు అర్జున్, గోపీచంద్, రామ్, బాలయ్య, ఎన్టీఆర్, ఫైనల్ గా ‘ఖడ్గం’లో రవితేజ చెప్పే ‘ఒకే ఒక్క ఛాన్స్’ అనే డైలాగ్ తో ఈ వీడియో ముగుస్తోంది. మొత్తానికి పూరి సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో.. పూరి డైలాగ్స్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటాయో ఈ వీడియో మరోసారి గుర్తు చేసింది. వీడియోలో డైలాగులు బాగా పేలాయి. అలాగే రాహుల్, ఆకాష్ పూరి హావభావాలు కూడా ఆకట్టుకున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనికి పూరీ జగన్నాథ్ సైతం ప్రశంసించారు. 'లవ్ యూ బోత్ రా' అంటూ కామెంట్ పెట్టాడు పూరీ. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ చూసేయండి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: