శ్రీ రెడ్డి ఈ పేరు వింటే చాలు వివాదం సైతం వణికి పోతూ ఉంటుంది. ఎప్పుడు తన వ్యాఖ్యలతో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది శ్రీ రెడ్డి. ముఖ్యంగా ఎంతో మంది ప్రముఖులు పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఎంతగానో ఫేమస్  అయిపోయింది ఈ అమ్మడు. తనకు సంబంధం లేని విషయాల్లో కూడా ఆరోపణలు చేసే శ్రీరెడ్డి... ఎన్నో విమర్శల పాలైంది కూడా. అంతేకాదు తెలుగు చిత్ర పరిశ్రమలో  మీటూ ఉద్యమం ని ఒక రేంజ్ లో పాపులర్ చేసి ఎంతోమందికి చెమటలు పట్టించింది శ్రీరెడ్డి. ఎంతో మంది ప్రముఖుల పేర్లను తెరమీదకు తీసుకు వచ్చి సంచలనం సృష్టించింది. ఫిలిం ఛాంబర్ ముందు తన అర్థనగ్న ప్రదర్శన తో దేశం చూపు మొత్తం తనవైపు తిప్పుకుంది. 

 

 

 అయితే తెలుగు ఇండస్ట్రీ మీద ఎంతగానో ఆరోపణలు చేసిన శ్రీ రెడ్డి ప్రస్తుతం తమిళ సినిమాల్లో అవకాశాలు వెతుక్కోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. అయితే అన్ని విషయాల్లో ఎంతో ఓపెన్ గా మాట్లాడే రెడ్డి పెళ్లి విషయంలో కూడా ఎంతో డేరింగ్  స్టేట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాను ఒక రాజకీయ నాయకుడిని పెళ్లి చేసుకుంటాను అంటూ గతంలో పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. ఇక ఆ తర్వాత తెరమీద కనిపించకుండా కాస్త సైలెంట్ అయిన శ్రీ రెడ్డి ప్రస్తుతం టిక్ టాక్ ద్వారా మళ్ళీ తెరమీదకు వచ్చేసింది . 

 

 

 మెడలో తాళిబొట్టు నుదుటున సింధూరంతో శ్రీరెడ్డి టిక్ టాక్ చేయడంతో ప్రస్తుతం శ్రీరెడ్డి కి పెళ్లి అయిపోయిందా అనే సందేహాలు మొదలయ్యాయి. ఇక ఈ వీడియో కింద క్యాప్షన్ గా  నాకు పెళ్లి అవలేదు ఇది కేవలం వీడియో వరకు మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చింది. కానీ కొంతమంది మాత్రం ఎవరికీ తెలియకుండా శ్రీరెడ్డి సీక్రెట్ గా వివాహం చేసుకుందేమో  అనే అనుమానాలు మాత్రం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది శ్రీరెడ్డి పెళ్లి చేసుకునే ఛాన్సే లేదు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: