సమీరా రెడ్డి చేసినవి తెలుగులు మూడు నాలుగు సినిమాలే అయినా సరే ఈమెకు వచ్చిన క్రేజ్ గురించి ఎంత చెప్పినా సరే తక్కువే. చేసిన సినిమాలు అన్నీ కూడా అగ్ర హీరోలతో సినిమాలు ఆ సినిమాలు హిట్ అయినా కాకపోయినా సరే ఈమె గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం వంటివి మన తెలుగులో జరిగాయి. ఈమె టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ అవుతుంది దాదాపు పదేళ్ళ పాటు ఆమెకు వరుస ఆఫర్లు వస్తాయి అని భావించిన వాళ్ళు అందరు కూడా ఆమె ఒక్కసారిగా బాలీవుడ్ వెళ్ళడం చూసి ఆశ్చర్యపోయిన సందర్భం ఉంది అనేది వాస్తవం 

 

ఎన్టీఆర్ తో ఉన్న ప్రేమ వ్యవహారం తో ఆమె బాలీవుడ్ లోకి వెళ్లిపోయింది అని కొందరు అంటే కాదు చిరంజీవి పై ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆమెను బాగా ఇబ్బంది పెట్టాయని అందుకే బాలీవుడ్ కి వెళ్ళింది అని మరికొందరు కామెంట్స్ చేసారు. ఆమెలో ప్రతిభ ఉన్నా సరే ఆమె దానిని వాడుకోవడం లో ఘోరంగా విఫలం అయింది అనేది బాలీవుడ్ జనాల మాట కూడా. టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో స్టార్ హీరోల పక్కన అవకాశాలు కొట్టేసింది గాని నిలబెట్టుకోవడం లో మాత్రం విజయవంతం కాలేదు అనే చెప్పాలి. మన తెలుగులో తర్వాత ఆమెకు ఆఫర్లు రాలేదు. 

 

అయితే ఎన్టీఆర్ తో ఉన్న ప్రేమ వ్యవహారం ఆమెను తెలుగు నుంచి పంపించింది అని కొందరు అప్పట్లో కామెంట్ లు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. దానికి కారణం ఏంటీ అనేది సష్టంగా తెలియదు గాని ఆమె మాత్రం బాగానే ఇబ్బంది పడింది అనేది వాస్తవం. ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయిపోయింది. పిల్లలు కూడా పుట్టారు అని వార్తలు కూడా వచ్చాయి గాని నిజమా కాదా తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: