విజయవాడకు చెందిన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన నటీమణి లయ 1992 వ సంవత్సరంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా భద్రం కొడుకో సినిమాలో నటించింది. మళ్ళీ ఏడు సంవత్సరాల తర్వాత 1999 లో ఏకంగా హీరోయిన్ గా స్వయంవరం సినిమాలో వేణు తొట్టెంపూడి సరసన నటించింది. సినిమాల్లోకి రాకముందు ఈమె చెస్ ఆట ఆడేవారు. చెస్ ఆటలో ఏడు సార్లు స్టేట్ ఛాంపియన్ గా గెలిచిన లయ... నేషనల్ లెవల్ లో ఆడి రెండవ స్థానాన్ని గెలుచుకుంది. తన నాన్న వృత్తిరీత్యా డాక్టర్ కావడం తన అమ్మ టీచర్ కావడంతో లయ ఏం కావాలంటే అది తెచ్చి పెట్టే సామర్థ్యం వారికి ఉండేది. లయకు కూచిపూడి నాట్యం కూడా నేర్పించంది తన అమ్మ. కూచిపూడి నాట్యం లో నైపుణ్యం సాధించిన అనంతరం తాను హైదరాబాద్ కి మకాం మార్చి 50కిపైగా స్టేజి షోలలో క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.


కూచిపూడి నాట్యం నేర్చుకున్న లయ తన మొహం లో ఎన్నో హావభావాలను చాలా చక్కగా పలికించేది. సినిమాల్లో రావడానికి కూడా తన క్లాసికల్ డాన్స్ ట్రైనింగ్ బాగా ఉపయోగపడిందని లయ ఎన్నో సందర్భాల్లో చెప్పింది. ఈ అచ్చ తెలుగు అమ్మాయి టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా మంచి పేరు తెచ్చుకున్నది. స్వయంవరం సినిమా చూస్తే... లయ పర్ఫామెన్స్ చూసి ఆమె ఎంతో అనుభవం ఉన్న స్టార్ హీరోయిన్ అని అందరూ భావిస్తారు కానీ సినిమాల్లో నటించడం ఆమెకి అదే మొదటిసారి. ఈ చిత్రం తర్వాత ఆమెకు ఏకంగా ఆరు సినీ అవకాశాలు వచ్చిపడ్డాయి. మా బాలాజీ, మనోహరం మనసున్న మారాజు, కోదండరాముడు, దేవుళ్ళు లాంటి సినిమాల్లో భిన్నమైన పాత్రల్లో నటించి అందరి ప్రశంసలను అందుకుంది.


2001వ సంవత్సరంలో ఏకంగా ఆరు సినిమాల్లో నటించి తన సత్తా ఏంటో చూపింది. ఈ ఆరు సినిమాల్లో ఒకటి కన్నడ సినిమా కావడం గమనార్హం. 2002వ సంవత్సరంలో పెళ్ళాం తో పనేంటి, నీ ప్రేమకై లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి తన స్టార్డమ్ తారా స్థాయికి తీసుకెళ్లింది. ఇలా 2006వ సంవత్సరం వరకు 34 సినిమాల్లో నటించి తెలుగు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. అయితే లయ జూన్ 14వ తేదీన 2006లో nri డాక్టర్ ను పెళ్లి చేసుకుంది. ఆమె భర్త పేరు శ్రీ గణేష్. పెళ్లి అనంతరం లయ భర్తతో కలిసి అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో స్థిరపడి పోయింది. వీరి వైవాహిక జీవితంలో ఇద్దరు పిల్లలు సంతానం కలిగింది. అయితే ఆమెకు ఒక అబ్బాయి అమ్మాయి కాగా... అమ్మాయి పేరు శ్లోక. ఈ చిన్నారి 2018వ సంవత్సరంలో తెరకెక్కిన రవితేజ సినిమా అమర్ అక్బర్ ఆంటోనీ లో ఇలియానా చిన్నతనం పాత్రలో నటించింది. లయ తన పెళ్లి అయిన తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: