మన తెలుగు అమ్మాయి అయినా సరే తమిళ సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్ అంజలి. దాదాపు అక్కడ అందరు స్టార్ హీరోలతో ఆమె వరుసగా అసినిమాలు చేసింది. అందులో ఎక్కువగా హిట్ సినిమాలు ఉండటం తో ఆమె ను అక్కడి దర్శక నిర్మాతలు ఎక్కువగా పట్టించుకుని ఆమెకు మంచి ఆఫర్లు ఇవ్వడమే కాదు రేటు కూడా వాళ్ళే స్వయంగా పెంచారు. కాని మన తెలుగులో మాత్రం ఆమె వరుసగా సినిమాలు చేయడం లో చాలా ఘోరంగా విఫలం అయింది. ఆమె స్కిన్ షో చేస్తాను అన్నా సరే మన వాళ్ళు వద్దు అనేసారు అని అంటున్నారు. 

 

దానికి కారణం ఏంటీ అనేది స్పష్టంగా తెలియదు గాని ఆమెను మన వాళ్ళు పక్కన పెట్టారు అని ఆమె అందుకే మన తెలుగు మీద అంతగా ఆసక్తి చూపించలేదు అని అంటున్నారు. ఇప్పుడు ఆమెకు తమిళ సినిమాల్లో మంచి ఆఫర్లు వస్తున్నాయి. అక్కడే ఆమె సినిమాలు చేస్తుంది. తెలుగులో ఆమె రవితేజా వెంకటేష్ వంటి హీరోలతో చేసినా సరే ఆమెకు మాత్రం మంచి పాత్రలు రాలేదు అనేది వాస్తవం. ఆమెను కొందరు దర్శక నిర్మాతలు బాగా ఇబ్బంది పెట్టారు అనే టాక్ కూడా మన తెలుగులో ఎక్కువగా వినపడింది. ఆమెను ఎందుకు ఇబ్బంది పెట్టారు అనేది తెలియదు గాని ఆమెను కొందరు భయపెట్టారు. 

 

అందుకే ఆమె తెలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చినా సరే కొన్ని రోజులు చేయడానికి భయపడింది   అని తర్వాత సినిమాలు చెయ్యాలి అని చూసినా సరే ఆఫర్లు రాలేదు దానికి తోడు ఆమె తమిళం లో బిజీ అయింది అని అంటున్నారు. ఇప్పుడు అక్కడ ఆమె ఏకంగా ఆరు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాలు అన్నీ కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: