తెలుగు టెలివిజన్ రంగంలో ఇప్పటి వరకు ఎన్నో కామెడీ సీరియల్స్, ప్రోగ్రామ్స్ వచ్చాయి. ఒకప్పుడు పరమానందయ్య శిశ్యులు, తెనాలి రామకృష్ణ, అమృతం సీరియల్స్ ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడేవారు.  ఆ తర్వాత అంతగా మెచ్చుకోదగ్గ సీరియల్స్ ఏవీ బుల్లితెరపై రాలేదు. ఇక ఆరేళ్ళ క్రితం ‘జబర్ధస్త్’ కామెడీ షో ప్రారంభం అయ్యింది. మొదట్లో పెద్దగా పేరు రాకున్నా మెల్లి మెల్లిగా కామెడీ స్కిట్స్ తో అలరించారు. ఇక యాంకర్ అనసూయ అందాలకు కుర్రకారు ఫిదా అయ్యారు.  జడ్జీలుగా నాగబాబు, రోజా చాలా హుందాగా ఉంటూ ప్రేక్షకుల మనసు దోచేశారు.  ఇలా ఆరేళ్ల పాటు ఎదురు లేకుండా టీఆర్ పీ రేటింగ్ లో దూసుకెళ్తూ నెంబర్ వన్ గా కొనసాగుతుంది.  ఇటీవల నాగబాబు జబర్ధస్త్ నుంచి బయటకు రావడం జీ తెలుగు లో ‘అదిరింది’ కామెడీ షో కి జడ్జీగా వ్యవహరించడం జరిగింది.  

 

అయితే ఈ షో పెద్దగా రాణించలేకపోతుంది.  జబర్ధస్త్ ను ఇక ఏ షో ఢీకొట్టలేదేమో అన్న సందర్భంలో ఒక షాక్ తగిలింది. ఇక కరోనా ప్రబలక ముందు బుల్లితెర టీఆర్పీ రేటింగ్స్ పేరు చెబితే, ఎవరికైనా గుర్తుకు వచ్చేది కార్తీకదీపం, జబర్దస్త్ షోలే. వీటిని ప్రేక్షకులు కూడా ఎంతో ఆదరించారు. ఇప్పుడు టివిలో కరోనా ప్రభావం ఈ రెండు సిరీయల్స్ పై దారుణంగా పడింది. ఇతర కార్యక్రమాలు... సినిమాలు, పాత సీరియల్స్ రిపీట్ కావడంతో  కార్తీకదీపం, జబర్దస్త్ షో తగ్గింది. అంతే ప్రస్తుతం షూటింగ్స్ ఆగిపోవడంవల్ల పాత ఎపిసోడ్స్ కంటిన్యూ చేస్తున్నారు.

 

ఇదే సమయంలో సీరియల్స్, రియాల్టీ షోల షూటింగ్స్ జరగకపోవడంతో జబర్దస్త్ పాత ఎపిసోడ్ లు ప్రసారం అవుతుండగా, కార్తీకదీపం సీరియల్ ను రిపీట్ చేస్తున్నారు. ఈ కారణంతోనూ వీటి రేటింగ్ పడిపోయిందని తెలుస్తోంది. తాజాగా తొలి రెండు స్థానాల్లో ఉండే ఈ కార్యక్రమాలు, గత వారం కిందకు దిగాయి. కార్తీకదీపం మూడో స్థానంలో, జబర్దస్త్ ఐదో స్థానానికి చేరాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: