టాలీవుడ్ లో ఒక వెలుగు వెలుగుతుంది అని భావించిన హీరోయిన్ ఆసిన్ దాదాపు అందరు అగ్ర హీరోలతో ఆమె వరుసగా సినిమాలు చేసినా సరే ఆమె కెరీర్ లో తెలుగు లో బిజీ మాత్రం అవ్వలేదు అనేది వాస్తవం. దానికి కారణం ఏంటీ అనేది తెలియదు గాని ఆమెకు తెలుగులో తర్వాత తర్వాత పెద్దగా ఆఫర్లు రాలేదు అని చెప్తూ ఉంటారు. ఆమె మన తెలుగులో వెంకటేష్ తో సినిమాలు చేసింది నాగార్జున తో రవి తేజా తో దాదాపు అందరు స్టార్ హీరోలతో ఆమె సినిమాలు చేసింది గాని బిజీ మాత్రం అవ్వలేదు అనేది వాస్తవం. 

 

కారణం ఆమె స్కిన్ షో చేయకపోవడమే అనేది కొందరు మాట్లాడే మాట. ఆమె ఘర్షణ సినిమాలో ఒక పాట ను స్కిన్ షో చెయ్యాలని అడిగినా సరే ఆమె మాత్రం చేయను అని చెప్పడం బాగా ఇబ్బంది పెట్టింది అని నాగార్జున సినిమాలో కూడా ఆమెకు అలాంటి ఆఫర్ వచ్చినా సరే ఆమె దానిని పూర్తిగా వదులుకుంది అని అంటున్నారు. ఆమె ఇప్పుడు తమిళంలో ఒకటో రెండో సినిమాలు చేస్తుంది. ఈ సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయి అనేది దాదాపుగా తెలియదు. ఇక మన తెలుగులో ఆమెకు ఆఫర్లు వచ్చినా సరే ఆమె కొన్ని కొన్ని కారణాలతో పక్కన పెట్టింది అని అంటున్నారు. 

 

ప్రస్తుతం ఆమెకు బాలీవుడ్ లో ఒక ఆఫర్ ఉంది. ఆమె అక్కడి హీరోలతో కూడా సినిమాలు చేసింది. ఇక ఇది పక్కన పెడితే ఆమె ఇప్పుడు మన తెలుగులో తల్లి పాత్రలకు కూడా ఓకే చెప్పింది అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఏ హీరో సినిమాలో ఆమె ఆ ఆఫర్ చేస్తుంది అనేది కూడా తెలియదు. ఏ హీరో సినిమాకు ఆఫర్ ఇచ్చారు అనేది త్వరలోనే తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: