టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ హోదా తెచ్చుకున్న హీరోయిన్ శ్రుతీ హాసన్. తండ్రి కమల్ హాసన్ వారసత్వాన్ని ఆమె అందుకుంది అంటూ కొందరు ఆమె స్టార్ హీరోయిన్ ఆమెకు తిరుగు అనేది లేదు అంటూ కొందరు కామెంట్స్ చేసారు. ఆమె చేసిన సినిమాలు మన తెలుగులో అన్నీ కూడా స్టార్ హీరోల సినిమాలే కావడం విశేషం. అయితే ఆ స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా ఫ్లాప్ కావాడం తో ఆమెను ఫ్లాప్ హీరోయన్ అని ఐరన్ లెగ్ హీరోయిన్ అని కొందరు కామెంట్స్ కూడా చేసారు. దీని తో ఆమె తెలుగులో ఆఫర్లు వచ్చినా సరే చేయడానికి ఇష్టం చూపించలేదు. 

 

ఇప్పుడు ఆమె మన తెలుగులో మళ్ళీ బిజీ అవ్వాలి అని చూస్తుంది. ఇందుకోసం ఆమె కొన్ని ఆపరేషన్ లు కూడా చేయించుకుంది అని అంటున్నారు. ఆమె విపరీతంగా బరువు పెరిగే వ్యక్తి అని అందుకే ఆమె బరువు పెరగకుండా ఉండటానికి ఇప్పుడు జాగ్రత్తలు ఎక్కువగా తీసుకుంటుంది అని అంటున్నారు. ఆమెకు తెలుగులో ఆఫర్లు వచ్చినా సరే ఆమె ఇప్పుడు కాస్త ఆలోచించి ఓకే చేస్తుంది అని అంటున్నారు. మన తెలుగులో ఇప్పుడు ఆమెకు మళ్ళీ డిమాండ్ వస్తుంది అని అంటున్నారు. మరి ఏ సినిమా ఆమె చేస్తుంది అనేది చూడాలి. 

 

పవన్ కళ్యాణ్ పక్కన ఆమెకు ఆఫర్ వచ్చింది. ఆ సినిమాలో ఆమె నటిస్తుందా లేదా అనేది త్వరలోనే బయటకు వస్తుంది. ఇక ఆమె బాలీవుడ్ మీద తన సొంత భాష తమిళ సినిమాల మీద దృష్టి పెట్టినా సరే ఆమె మాత్రం అక్కడ ఆఫర్లు రాక ఇబ్బంది పడుతుంది అని కొందరు అంటున్నారు. మన తెలుగులో ఆమె వచ్చిన అవకాశాలను ఎక్కువగా వాడుకోవడం లేదని కొన్ని కొన్ని కారణాలతో ఆమె రేటు పెంచుతుంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: