అక్కినేని నాగార్జున తెలుగు సినీ ఇండస్ట్రీ మన్మధుడు, కె.విజయ భాస్కర్ దర్శకత్వంలో, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, డైలాగ్స్ అందించిన `మన్మధుడు` సినిమాను ప్రేక్ష‌కులు అస్స‌ల మ‌ర్చిపోలేరు. అంత‌లా ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. ఈ చిత్రంలో నాగార్జున కి జోడిగా సోనాలి బింద్రే, అన్షు నటించారు. 2002లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫిస్ వ‌ద్ద సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా ఈ చిత్రంలో బ్రహ్మానందం కామెడీ ఐతే ఎప్పటికీ మరిచిపోలేము. ఇక ఈ సినిమాలో హీరోయిన్ అన్షు క్యారెక్ట‌ర్ కూడా హైలైట్ అని చెప్పుకోవాలి.

సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో అప్పట్లో ఈమె పేరు మార్మోగిపోయింది. వాస్త‌వానికి సినిమా చాయగ్రహుడు కబీర్ లాల్ అన్షుకు కుటుంబ మిత్రుడు. నటనలో అసక్తి ఉన్న అన్షు ఫోటోలను కొన్నిటిని విజయ భాస్కర్ గారికి చూపించడం జరిగింది. అలా మన్మధుడు సినిమా అన్షు ఎంపికైంది. ఆ తరువాత ప్రభాస్ హీరోగా నటించిన రాఘవేంద్ర సినిమాలో హీరోయిన్ పాత్రను, మిస్సమ్మ సినిమాలో అతిధి పాత్రలో నటించింది. కొన్ని కన్నడ చిత్రాలలో కూడా నటించింది. అయితే ఉన్న‌ట్టుండి అన్షు వెండితెర‌కు దూర‌మైంది. 

IHG

స్టార్ హీరోయిన్ అవుతుంద‌నుకున్న అన్షు ప్ర‌స్తుతం ఎక్క‌డ ఉంది..? ఏం చేస్తుంది..? అన్న‌ది ప‌రిశీలిస్తే.. అన్షు నిజానికి ఒక ఎన్నారై. అమ్మడు అప్పట్లో తిరిగి లండన్ వెళ్ళిపోయి తన చదువులు తన చదువుకుందట. సినీ పరిశ్రమలో రాణించడం చాలా కష్టం అని ఫీలై.. ఈ ఫీల్డ్ వదిలేసిందట. ఇక లండన్ లోనే పుట్టి పెరిగిన అన్షు అక్కడే ఉంటున్న సచిన్ సగ్గార్ అనే వ్యాపారిని పెళ్లి చేసుకుని ప్రశాంతమైన జీవితం గడుపుతుంది వీరికి ఒక పాప కూడా ఉంది. ప్ర‌స్తుతం అన్షు లండన్లో ఓ డిజైనర్ దుస్తుల దుకాణం నడుపుతోంది. 'ఇన్ స్పిరేషన్ కౌచర్' అంటూ ఆమె నడిపే దుకాణంలో బాలీవుడ్ హీరోయిన్లు ధరించిన డ్రస్సులకు దగ్గరగా ఉండే డూప్లికేట్ డిజైన్లను తయారు చేసి సేల్ చేస్తార‌ట‌. ఏదేమైన‌ప్ప‌టికీ 

మరింత సమాచారం తెలుసుకోండి: