స్టార్ హీరోయిన్ అవ్వకపోయినా సరే మన తెలుగులో కేధరిన్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆమె చేసిన సినిమాలు చాలా తక్కువే అయినా సరే ఆమె కు అప్పుడు అప్పుడు ఆఫర్లు మాత్రం వస్తూ ఉంటాయి. మంచి పాత్రలు ఉంటే ఆమె చేస్తుంది. కథ డిమాండ్ చేస్తే ఆమె ఎలా అయినా సరే నటించడానికి ఇబ్బంది పడే నటి కాదు అని అంటారు. ఆమె ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పింది అని అంటూ ఉంటారు. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆమె గురించి ఒక్కసారి చూస్తే ఆమె తెలుగులో తమిళంలో ఆఫర్లు వచ్చినా సరే చేయకపోవడానికి ప్రధాన కారణం ఏంటీ అనేది చూస్తే... 

 

ఆమెకు మన తెలుగు మీద అయినా తమిళం మీద అయినా సరే ప్రత్యేకంగా ప్రేమ అంటూ ఏదీ లేదని కాని ఆమెకు మంచి పాత్రలు వస్తే చేయడానికి సిద్దంగా ఉంటుంది అని అందుకే ఆమె చాలా ఆఫర్లు వచ్చినా సరే తన పాత్రకు ప్రాధాన్యత లేదు అని పక్కన పెట్టింది అని అంటూ ఉంటారు. ఆమె మన తెలుగులో చేసిన సినిమాల్లో ఎక్కువగా ఆమె నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలే. ఆమె నటనకు ప్రాధాన్యత ఇచ్చే హీరోయిన్ అనేది చాలా మంది చెప్పే మాట. ఇక అవసరం అనుకుంటే స్కిన్ షో చేయడానికి ఏ మాత్రం కూడా ఆమె ఇబ్బంది పడే రకం కాదు. 

 

కాని మన ప్రేక్షకులకు తక్కువ కాలంలో దగ్గర అయినా సరే మంచి ఆఫర్లు వచ్చిన సమయంలో ఆమె నిరూపించుకోలేదు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నేనే రాజు నేనే మంత్రి సినిమాలో ఆమె చేసిన పాత్ర హైలెట్ అయింది. అలాగే పవన్ కళ్యాణ్ సినిమాలో ఆమె చేసిన పాత్ర ఎక్కువగా హైలెట్ అయింది అని చెప్తారు. కాని ఆమె సినిమాల మీద దృష్టి పెట్టలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: