మామూలుగా చిత్ర పరిశ్రమలో  సాదా సీదా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోయిన్ గా మారాలి అంటే... అందం టాలెంట్ మాత్రమే కాదు అదృష్టం కూడా బాగా కలిసి రావాలి. ఇలా అదృష్టం బాగా కలిసి వచ్చింది అంటే స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తూ ఉంటాయి. మామూలుగా అయితే స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చాయి అంటే స్టార్ హీరోయిన్ గా మారిపోవడం ఖాయం అని అంటూ ఉంటారు. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ వచ్చి ఆ సినిమా మంచి విజయం సాధిస్తే... ఇక హీరోయిన్ క్రేజ్ ఏ రేంజిలో క్రేజ్  పెరిగిపోతుంది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఇక్కడ ఒక హీరోయిన్ కు మాత్రం స్టార్ హీరోల సినిమాల్లో నటించినప్పటికీ అవి మంచి విజయాలు అందుకున్నప్పటికీ... ఎన్నో రోజులు తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగలేక పోయింది. 

 

 ఆ హీరోయిన్ ఎవరో కాదు సిమ్రాన్... తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. చిరంజీవి వెంకటేష్ బాలకృష్ణ నాగార్జున ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోల సినిమాల్లో కలిసి నటించింది. సిమ్రాన్ నటించిన  సినిమాలు మంచి విజయాన్ని కూడా అందుకున్నాయి. కానీ ఈ అమ్మడికి ఇవన్నీ అంతగా కలిసి రాలేదు. విజయవంతమైన  సినిమాలు చేసినప్పటికీ... పరిశ్రమలో  సిమ్రాన్ ఎక్కువ రోజులు నిలదొక్కుకోలేక పోయింది. 

 

 

 రెండు మూడేళ్ల పాటు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కొనసాగినప్పటికీ ఆ తర్వాత మాత్రం తనను తాను కొత్తగా చూపించుకోవడం లో విఫలం అయింది సిమ్రాన్. స్టార్ హీరోలతో సినిమాలు తీసిన అవి విజయం సాధించిన అంతగా ఉపయోగపడలేదు. దీంతో అటు దర్శక నిర్మాతలు కూడా సిమ్రాన్ పై ఆసక్తి చూపలేదు. దీంతో క్రమక్రమంగా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అవకాశాలు లేకపోవడంతో తెలుగు తెరపై కనుమరుగైపోయింది సిమ్రాన్. స్టార్ హీరోలతో చేసినప్పటికీ స్టార్ హీరోయిన్గా నిలదొక్కుకోలేక పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: