ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ హిస్టారికల్ మూవీ 'ఆర్ఆర్ఆర్'. రౌద్రం రణం రుధిరం పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలంగాణ పోరాట యోధుడు కొమరం భీం పాత్రలో, అలానే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్లు గా అలియా భట్, ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ నటుడు సముద్ర ఖని, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, లతో పాటు మరికొందరు హాలీవుడ్ నటులు కూడా పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

 

ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టైటిల్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో పాటు రామ్ చరణ్ పోషిస్తున్న అల్లూరి సీతారామరాజు పాత్ర తాలూకు ఫస్ట్ లుక్ వీడియో ని కూడా యూట్యూబ్ లో రిలీజ్ చేసింది ఆర్ఆర్ఆర్ యూనిట్. కాగా వాటికి అటు అభిమానులతో పాటు ప్రేక్షకుల నుండి కూడా మంచి స్పందన లభించడం, అలానే అవి సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేయడం జరిగింది. ఇకపోతే మరొక రెండు రోజుల్లో, అనగా మే 20 న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా అవకాశం ఉంటే ఆయన పాత్ర తాలూకు ఫస్ట్ లుక్ వీడియో ని రిలీజ్ చేస్తాం అని ఇటీవల ఒక వీడియో ఇంటర్వ్యూ సందర్భంగా దర్శకుడు రాజమౌళీ తెల్పడం జరిగింది. కాగా కాసేపటి క్రితం ఆర్ఆర్ఆర్ యూనిట్ ఈ విషయమై ఒక అధికారిక ప్రకటన ను రిలీజ్ చేసింది. 

 

గత కొద్దిరోజులుగా ప్రేక్షకులతో పాటు ఎన్టీఆర్ అభిములు సైతం కొమరం భీం ఫస్ట్ లుక్ వీడియో కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న విషయం తమకు తెలుసునని, అయితే కొన్నాళ్లుగా కరోనా వ్యాధి నేపథ్యంలో మన దేశంలో కొనసాగుతున్న లాక్ డౌన్, మరిన్ని రోజులు పొడిగింపబడడంతో ఇటువంటి పరిస్థితుల్లో కొమరం భీం ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయలేము అని వారు తమ ప్రకటనలో తెలిపారు. అయితే ఈ పరిస్థితిని అందరూ అర్ధం చేసుకోవాలని కోరిన ఆర్ఆర్ఆర్ యూనిట్, అవకాశం ఉంటే అతి త్వరలో మంచి సమయం చూసుకుని కొమరం భీం ఫస్ట్ లుక్ ని తప్పక రిలీజ్ చేస్తాం అని కూడా తమ ప్రకటనలో తెల్పడం జరిగింది. ఇక ఈ ప్రకటనతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంత నిరాశ చెందారని చెప్పాలి. మరి ఇంతకీ కొమరం భీం ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుందో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజలు వెయిట్ చేయాల్సిందే.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: