విజయ్ దేవరకొండ హిట్ ఫ్లాప్ లతో సంబందం లేకుండా సినిమా ఛాన్స్ లుకొట్టేస్తున్నాడు . నిజానికి రెండేళ్‌లుగా విజయ్ కి సరైన హిట్ సినమా లేదు . అయినా సరే .. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు  విజయ్ కుఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో ఫైటర్ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినమాతో విజయ్ బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు . ఈ సినిమా ఇంకా కంటిన్యూ అవుతుండగానే నెక్ట్స్ సినిమాల గురించి సోషల్ మీడియాలో ఇంట్రస్టింగ్ న్యూస్ చెబుతున్నాడు విజయ్.

 

రీసెంట్ గా విజయ్ బర్త్ డే రోజు డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ  విజయ్.. ఈ సంవత్సరం  నువ్వింకా అద్భుతాలు చెయ్యాలి.. వాటన్నింటినీ మేం చూడాలి అని విష్ చేస్తే.. ఆ అద్బుతాల్ని మనిద్దరం కలిసి చేస్తున్నాం అంటూ ఇంద్రగంటితో సినిమా చేసే విషయాన్ని ఇన్ డైరెక్ట్  అనౌన్స్ మెంట్  ఇచ్చాడు విజయ్.


 
మొన్నటికి మొన్న .. అర్జున్ రెడ్డితో తనను స్టార్ హీరోని చేసిన సందీప్ రెడ్డి వంగాకి  ఇంట్రస్టింగ్ కామెంట్ పెట్టాడు విజయ్. రీసెంట్ గా విజయ్ దేవరకొండ ఫౌండేషన్, మిడిల్ క్లాస్ ఫండ్ ని అనౌన్స్ చేసినప్పుడు వెల్ డన్ అని సందీప్ మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు . సందీప్ ట్వీట్ కి .. మిస్ యు వంగా.. ఈ లాక్డౌన్ టైమ్ లో 2, 3 స్క్రిప్ట్ లు రెడీ చెయ్.. నీతో సినిమా చెయ్యడానికి రెండేళ్లు నేను  వెయిట్ చెయ్యలేను అంటూ ట్విట్టర్ లో  పోస్ట్ పెట్టాడు విజయ్ దేవరకొండ.

 

దాంతో మళ్లీ  సందీప్ రెడ్డి  కాంబినేషన్లో మరో మ్యాసివ్ మూవీ రాబోతోందని ఫ్యాన్స్ కి  ఇప్పటినుంచే  ఊరించేస్తున్నాడు విజయ్. ఈ ఇద్దరు డైరెక్టర్ల తో పాటు మరో డైరెక్టర్ శివ నిర్వాణ తో కూడా సినిమా చేస్తున్నాడని  టాక్ నడుస్తోంది. శివ.. టక్ జగదీష్ తర్వత  విజయ్  దేవరకొండతోనే సినిమా చేస్తున్నట్టు న్యూస్ వినిపిస్తున్నా.. ఈ వార్తల్ని ఏమాత్రం కొట్టిపారేయట్లేదు విజయ్. అంటే శివ తో విజయ్ సినిమా ఆల్ మోస్ట్ కన్ ఫామే అనుకుంటున్నారు టాలీవుడ్ జనాలు . ఇలా విజయ్ .. చెప్పీ చెప్పనట్టు, హింట్లు ఇస్తూ.. అటు ఆడియన్స్ ని, డైరెక్టర్లనీ ఊరించేస్తున్నాడు విజయ్.

మరింత సమాచారం తెలుసుకోండి: