ఇపుడు అందరికీ ఎక్కువగా ఈ పదం తెలిసిపోతోంది. అదే ఓటీటీ. ఇంతకాలం పెద్దగా పరిచయం కానీ ఈ పదం ఇపుడు అవసరం అయి కూర్చుంది.  కాలం కలసివచ్చి ఓటీటీ ఇపుడు ఫ్రంట్ లైన్లోకి వచ్చేసింది.  సినిమా ప్రియులకు వినోదం అందిస్తోంది. అలాగే గుమ్మం బయటపెట్టకుండా వ్యయ ప్రయాసలు పెద్దగా పడకుండా ఓటీటీ ఆపదలో ఆదుకుంటోంది.

 

నెలకు వేయి రూపాయలు కడితే చాలు సినిమాలు అన్నీ వచ్చేస్తాయి. హాయిగా ఇంటిల్లపాది కూర్చుని తమ ఇంట్లో టీవీ స్క్రీన్ మీదనే సినిమా చూసే అవకాశాం లభిస్తోంది. ఓ వైధంగా చూసుకుంటే సామాన్యుడి సినిమా బడ్జెట్ ని చాలా చాలా తగ్గించేస్తోంది. ఓటీటీ ఫ్లాట్ ఫారం మీద సినిమాలే కాదు, వెబ్ సిరీస్ కూడా చూసుకోవచ్చు. నచ్చిన దాన్ని క్షణాల్లో చూసుకుంటూ తనకు కావాల్సిన ఆనందం తాను ఉన్న చోటనే సొంతం చేసుకోవచ్చు.

 

లాక్ డౌన్ పీరియడ్లో ఓటీటీ వీర విహారం అలా ఇలా లేదు. దాంతో ఇపుడు ఐమాక్సులు,  భారీ స్క్రీన్ తో ఉన్న థియేటర్లు వెలవెలపోతున్నాయి. అవన్నీ గమ్మున్న ఉన్న వేళ ఓటీటీ విశ్వరూపం చూపించడంతో ఎక్కడో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. సినిమాలకు జనాలు లాకుండా ఓటీటీ లాక్ చేసేస్తే ఇక శాశ్వతంగా తలుపులు మూసుకోకతప్పదేమోనని ధియేటర్ల యజమానులు హడలిపోతున్నారు.

 

దాంతో ఓటీటీకి సినిమాలు ఏ నిర్మాత ఇవ్వరాదని కొత్త రూల్ పాస్ చేస్తున్నారు. అలా చేస్తే ఆ నిర్మాతల సినిమాలను బ్యాన్ చేస్తామని కూడా గట్టి హెచ్చరికలు పంపుతున్నారు. నిజంగా ఇది జరిగే పనేనా. సినిమాలు తీసి ఎంతకాలం నిర్మాత దాచుకుంటాడు. సినిమా అన్నది అప్పటికపుడు మార్కెట్ లోకి రావాలి. అపుడే దానికి ఫ్లావర్ ఉంటుంది.

 

అలా కాకుండా సినిమాను తీసిన ఆరు నెలల తరువాత బయటకు తెస్తె పాచిపోయి ఆడియన్స్ తిప్పికొడతారు. పైగా ఇపుడు లాక్ డౌన్ వేళ సినిమా హాళ్ళు తెరచుకుంటాయో లేదో పెద్ద డౌట్లు ఉన్నాయి. దాంతో నిర్మాత తన ప్రోడక్ట్ ని అమ్ముకోవడానికి చూస్తాడు. అతని మీద ఆంక్షలు పెట్టి అడ్డుకోవాలని చూస్తే మరింతగా థియేటర్లు నష్టపోతాయని అంటున్నారు. మొత్తానికి ఇపుడు జనాలకు ఓటీటీ వల్ల పర్స్ బరువు పెరుగుతోందిట. 

 

ఒక సినిమాకు బయట హాల్ కి వెళ్తే కచ్చితంగా వేయి రూపాయలు  అవుతుంది. అక్కడే అన్నీ కొనాలి. ఇలా జులుం చేస్తూ తమ వ్యాపారాన్ని ఇన్నాళ్ళొ పెంచుకున్న  ఐమాక్సులు ఇపుడు ఓటీటీని చూసి ఏడవడం తగదని అంటున్నారు. ఓటీటీతో పోటీ పడాలంటే తక్కువ ధరకే సినిమా చూసేలా యాక్షన్  ప్లాన్ రెడీ చేసుకోవాలి అంటున్నారు. లేకపోతే కొంపకొల్లేరేనని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: