రీసెంట్ గా గబ్బర్ సింగ్ రిలీజ్ అయి 8ఏళ్లు పూర్తైన సందర్భంగా హరీశ్ శంకర్ చేసిన ఓ ట్వీట్ రేపిన వివాదం గురించి తెలిసిందే. తన ట్వీట్ లో టీమ్ అందరికీ కృతజ్ఞతలు చెప్పి నిర్మాత బండ్ల గణేశ్ పేరు మర్చిపోయాడు హరీశ్. హరీశ్ చేసిన పనికి బండ్ల గణేశ్ కు ఆగ్రహం తెప్పించింది. హరీశ్ పై వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డాడు. అప్పటినుంచి వీరిద్దరి మధ్య జరుగుతున్న వార్ ఇంకా కంటిన్యూ అవుతుంది. అయితే ఈ అగ్నికి ఆజ్యం పోస్తూ ప్రముఖ నిర్మాత పీవీపీ చేసిన ఓ ట్వీట్ వైరల్ అయింది.

 

 

‘పైన అమ్మ వారు కింద కమ్మ వారు ఉంటారు.. అంటూ మా బెజవాడను బ్రహ్మాండంగా చెప్పావు. బ్లేడ్ బాబు ఇకపై నీతో సినిమాలు తీయడట. వాడు యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్ కూడా తియ్యలేడు. నీకేమో నేనే కాక డజన్ల మంది నిర్మాతలు, మిరపకాయను మించి దువ్వాడను దాటించే సినిమా తియ్యడానికి వెయిటింగ్’ అంటూ ఆజ్యం పోశాడు. దీనికి స్పందించిన హరీశ్.. ‘మీ భాష, భావం రెండే నన్ను అలరించాయి. ఓ మనిషిని చీల్చి చెండాడడానికి ఫైటే అక్కరలేదు.. ట్వీట్ చాలు అని నిరూపించారు. మీ రేంజ్ మ్యాచ్ చేయాలనే నా ప్రయత్నం. నన్ను, నా పనితనాన్ని గుర్తించినందుకు థ్యాంక్స్ సర్’ అని రిప్లై ఇచ్చాడు.

 

 

ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో బాగా వైరల్ అయింది. హరీశ్ ను పీపీపీ సపోర్ట్ చేస్తూ ఈ ట్వీట్ చేయడం మరింత అగ్గి రాజేస్తోంది. నిజానికి హరీశ్ శంకర్ తన ట్వీట్ లో పొరపాటు జరిగిందని వెంటనే మరో ట్వీట్ లో బండ్ల గణేశ్ కు కృతజ్ఞతలు చెప్పాడు. కానీ జరగాల్సిన వివాదం జరిగింది. మరి దీనిపై బండ్ల రియాక్షన్ ఏంటో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: