టాలీవుడ్ లో చేసిన సినిమాలు తక్కువే అయిన ఆది పినిశెట్టి కి మంచి గుర్తింపు వచ్చింది. బాబు పెద్దగా సినిమాలు చేయకపోయినా సరే అతని గురించి ఏదోక వార్త మనం చదువుతూనే ఉన్నాం. ఇక ఈ మధ్య కాలంలో అతను మన తెలుగులో పెద్దగ సినిమాలు చేయడం లేదు. ఎప్పుడో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమాలో విలన్ గా నటించాడు. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో అతను కనపించాడు. అయితే ఇప్పుడు అతను దర్శకుడి గా మారే ప్రయత్నం చేస్తున్నాడు అని వార్తలు వస్తున్నాయి. 

 

అది ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని అతను మాత్రం ఇప్పుడు తన తండ్రి సహకారం తో సినిమాలను చేసే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది. మరి ఏ భాషలో సినిమాలు చేస్తాడు అనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతం అతని చేతిలో నటుడిగా ఏ సినిమా కూడా లేదు. మరి టాలీవుడ్ లో చేస్తాడా తమిళం లో చేస్తాడా అనేది చూడాల్సి ఉంది. ఇక మన తెలుగులో ఇప్పుడు అతనికి పెద్దగా విలన్ గా కూడా డిమాండ్ లేదు అని అందుకే అతనిని ఎవరూ పెద్దగ పట్టించుకోవడం లేదు అని అంటున్నారు. అందుకే అతను ఇప్పుడు సినిమాలను వదిలేసే ఆలోచనలో ఉన్నాడు అని తెలుస్తుంది. 

 

మన తెలుగులో కొన్ని సినిమాలకు ఆయనను అడిగినా సరే సరిపోయే అవకాశం లేదని పక్కన పెట్టారు అని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అతను ఒక కథను రెడీ చేసుకు ని స్టార్ హీరో ని కూడా లైన్ లో పెట్టాడు అని టాలీవుడ్ లో ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. నిజం ఎంత అనేది తెలియాలి అంటే కొంత కాలం ఎదురు చూడాల్సిందే. ప్రస్తుతం అతను ఒక సినిమాను కన్నడం లో చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: