మ్యూజిక్ డైరక్టర్ థమన్ ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడని చెప్పొచ్చు. అల వైకుంఠపురములో సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న థమన్ వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. అయితే మణిశర్మ దగ్గర పనిచేస్తున్న సాయి థమన్ కు మొదటి ఛాన్స్ ఇచ్చింది మాస్ మహారాజ్ రవితేజ. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో కిక్ సినిమాతో థమన్ కు మొదటి సినిమా ఛాన్స్ ఇచ్చాడు రవితేజ. ఆ సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న థమన్ వరుస స్టార్ ఛాన్సులతో అదరగొట్టేస్తున్నాడు. 

 

స్టార్ హీరోల సినిమాలకు థమన్ మొదటి ఆప్షన్ గా మారాడు. డిఎస్పీ కొద్దిగా వెనుక పడటంతో ఈ గ్యాప్ లో థమన్ దుమ్ముదులిపేస్తున్నాడు. ప్రస్తుతం థమన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాకీన్ సాబ్ తో పాటుగా రవితేజ క్రాక్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. రీసెంట్ గా హలో కోసం స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చిన థమన్ క్రాక్ సినిమాతో రవితేజకు హిట్ పక్కా అనేస్తున్నారు. కిక్ తో రవితేజ తనకు ఛాన్స్ ఇవ్వగా ఆ తర్వాత ఈ ఇద్దరు కలిసి చేసిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. 

 

ఇప్పటివరకు రవితేజ, థమన్ 9 సినిమాలు చేశారు. తొమ్మిది సినిమాలు మ్యూజికల్ హిట్ కాగా రాబోతున్న క్రాక్ కూడా కచ్చితంగా మ్యూజిక్ హిట్ అవుతుందని అన్నారు. కిక్ టు క్రాక్ థమన్ రవితేజ థమన్ సక్సెస్ ఫుల్ కాంబో మరోసారి సెన్సేషనల్ కానుంది. మరి థమన్ చెప్పినట్టుగా రవితేజకు హిట్ ఇస్తాడేమో చూడాలి. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబో సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తాడని తెలుస్తుంది. మళ్ళీ అల వైకుంఠపురములో లాంటి మ్యూజిక్ ఇస్తాడేమో చూడాలి.                             

మరింత సమాచారం తెలుసుకోండి: