రానా... మన తెలుగులో ఈ పేరు యూత్ లో ఎక్కువగా వినపడుతూ ఉంటుంది. ఈ ద‌గ్గుబాటి వంశాం కురం ఏది చేసినా సరే సోషల్ మీడియా లో దాని గురించి ఎక్కువగా చర్చలు జరుగుతూ ఉంటాయి. రానాలో ఉన్న ప్రతిభ గురించి కూడా టాలీవుడ్ జనాలు ఎక్కువగా చర్చిస్తూ ఉంటారు. రానా కెరీర్ ఎక్కువుగా ఏదో ఒక ఫోక‌స్ టాపిక్ చుట్టూనే న‌డుస్తూ ఉంటుంది. అది బాహుబ‌లి సినిమాలో భ‌ళ్లాల దేవుడు పాత్ర అయినా కావొచ్చు... లేదా త్రిష తో ఎఫైర్ కావొచ్చు.. లేదా అత‌డి ఆరోగ్యం గురించి వ‌చ్చిన పుకార్లు కావొచ్చు. రానా గురించి ఏదో ఒక విష‌యం మీడియా లో బాగా నానుతూ ఉంటుంది.

 

ఇక ఇప్పుడు అతని పెళ్లి గురించి ఎక్కువగా జరుగుతున్నాయి చర్చలు. ఇక రానా పెళ్లి ఇక్కడ చేసుకోవడం లేదని అంటున్నారు. అతను హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో చేసుకుంటున్నాడు అని సమాచారం. ప్రత్యేక విమానాల్లో తన కుటుంబ సభ్యులు అందరిని తీసుకుని వెళ్లి, రాజకీయ నాయకులకు కొందరికి విమానాలు ఏర్పాటు చేసి అక్కడ వివాహం చేసుకుంటాడు అని అంటున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యులు అక్కడ ఉన్న ఒక పాపులర్ రిసార్ట్ ని కూడా బుక్ చేశారు అని ప్రచారం మాత్రం జరుగుతుంది. 

 

నిజం ఎంత అనేది తెలియదు గాని అక్కడ పెళ్లి చేసుకునే ఆలోచన రానాది కాదని అతని కాబోయే సతీమణి అయిన మ‌హికా బ‌జాజ్ ది అని అంటున్నారు. త్వరలోనే ఈ పెళ్ళికి సంబంధించి ఒక ప్రకటన కూడా వస్తుంది అని అంటున్నారు. రానా అక్కడ పెళ్లి చేసుకుని కొన్ని రోజులు అక్కడే ఉంటాడు అని సమాచారం. ఎవరికి ఆహ్వానాలు ఇవ్వాలి అనే దాని మీద మాత్రం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి ఇంట్లో అని అంటున్నారు. ఇక సురేష్ బాబు సైతం రానా పెళ్లి ఈ యేడాదిలోనే ఉంటుంద‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: