మన తెలుగులో మహేష్ బాబు సినిమా వస్తుంది అనగానే చాలా మంది పనులు మానుకుని చూసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక అతని సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు సినిమాలు అనేవి ఈ మధ్య కాలంలో ఎక్కువగా హిట్స్  కొడుతున్నాయి. కొన్ని సినిమాలు మాత్రం అతనిని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు అతను పూర్తి స్థాయి సినిమాలను పక్కన పెట్టి కొన్ని సినిమాల మీద ప్లాన్ చేస్తున్నాడు అని అంటున్నారు. అతను ఇప్పుడు వెబ్ సీరీస్ చేసే ఆలోచనలో ఉన్నాడు అని సమాచారం. 

 

అందుకే మహేష్ బాబు తన లుక్ ని పూర్తిగా మార్చుకున్నాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. లాక్ డౌన్ లో అతను ఒక తమిళ దర్శకుడి తో కలిసి ఒక చిన్న సినిమాను ప్లాన్ చేస్తున్నాడు అని సమాచారం. ఇంట్లో ఉండి ఉండి మానసికంగా ఇబ్బంది పడుతున్న ఒక మెడికల్ విద్యార్ధికి సంబంధించి ఈ సినిమా ఉంటుంది అని సమాచారం. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు ఏ హడావుడి లేకుండా తీసుకుని వెళ్ళే ఆలోచనలో మహేష్ బాబు ఉన్నాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ సినిమాకు నిర్మాత గా ఒక హీరో ఉండే అవకాశం ఉందని, 

 

ఆయన మానసిక డాక్టర్ గా నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా కథను రెడీ చేసింది మాత్రం నమ్రత అని సమాచారం. ఈ సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే అవకాశం ఉందని టాలీవుడ్ లో చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో మహేష్ పిల్లలు భార్య కూడా కనిపించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇది ఎంత వరకు నిజమో చూడాలి అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: