టాలీవుడ్ లో కొందరు నిర్మాతలు స్టార్ హీరోలతో సమానంగా పాపులారిటి సంపాదించుకున్నారు. అందులో ప్రధానంగా చెప్పుకునే నిర్మాత దిల్ రాజు. దిల్ రాజు తో సినిమాలు చేయడానికి కొందరు హీరోలు ఎంతగానో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయినా సరే నిర్మాతగా ఆయనకు మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. దీనితో స్టార్ హీరోలు కూడా ఆయన తో సినిమాలు చేయడానికి చూస్తారు. అటు దిల్ రాజు కూడా 2003లో నితిన్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో వచ్చిన దిల్ సినిమాతో నిర్మాతగా మారి అప్పటి నుంచి వరుసగా గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.
దిల్ రాజు టాలీవుడ్ టాప్ హీరోలు అందరితోనూ సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. బాలయ్య తో కూడా ఓ సినిమా అనుకున్నాడు. అయితే ఇటీవల దిల్ రాజుతో ప్రభాస్ సినిమా చేద్దామని చెప్పి వద్దు అని చెప్పాడట. దీనికి కారణం ఏంటీ అనేది తెలియదు గాని దిల్ రాజు కి సినిమా వద్దు అని చెప్పేసాడు అని టాలీవుడ్ లో టాక్. దీనికి కారణం తన సినిమాలో తనకు రెమ్యునరేషన్ వద్దు అని... తాను కూడా పెట్టుబడి పెడతాను అని చెప్పినా సరే రాజు ఇందుకు ఒప్పుకోలేదట. దీంతో ప్రభాస్ ఈ విషయంలో అసహనం వ్యక్తం చేసినట్టు టాక్..? ఇక ఈ సినిమా కోసం దర్శకుడు కథ చెప్పడం ఆ కథ ప్రభాస్ కి నచ్చడం జరిగాయి.
ఇక గతంలో ఇచ్చిన మాట ప్రకారం సినిమా చేద్దామని చూసినా సరే దిల్ రాజు కాస్త తానే నిర్మాతగా ఉంటానన్న కోణంలో మాట్లాడట౦తో ప్రభాస్ వద్దు అని చెప్పేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు దిల్ రాజు ప్రభాస్ తో మాట్లాడే ప్రయత్నం చేసినా సరే ఆయన మాట్లాడటం లేదు అని సమాచారం. చిన్న చిన్న వాటికి మన తెలుగులో అనవసరంగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా దాదాపుగా అదే జరుగుతుంది.