కరోనా వైరస్ దెబ్బకి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ చాల స్ట్రిక్ట్ గా అమలు చేయటంతో సినిమా ఇండస్ట్రీకి చాలా నష్టం వాటిల్లింది. వేసవి కాలం సీజన్ కావడంతో విడుదల కావాల్సిన సినిమాలు, షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలు ప్రీ రిలీజ్ వేడుకలు జరుపుకోవడం కోసం రెడీ ఉన్న సినిమాల పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. పరిస్థితులు ఎప్పుడూ కంట్రోల్ అవుతాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది. రోజురోజుకీ వైరస్ ప్రభావం పెరుగుతుండటంతో సినిమా థియేటర్లు ఇంకా నాలుగు నెలలు తెరుచుకునే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాల నుండి అందుతున్న సమాచారం. దీంతో సినిమాలను నిర్మించిన నిర్మాతలు చాలా నష్టపోయే అవకాశం ఉండటంతో, వచ్చే కొద్ది లాభం అయినా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ద్వారా ‌ సంపాదించాలి అని అనుకుంటున్నారు.

 

ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌ ద్వారా సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు రిలీజ్ చేయాలని అనుకుంటున్నా తరుణంలో థియేటర్ల యాజమాన్యాలు ఈ నిర్ణయాన్ని పూర్తిగా తప్పు పడుతున్నాయి. మల్టీప్లెక్స్ థియేటర్ యాజమాన్యాలు కూడా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌ ఈ విధానం ద్వారా సినిమాలు రిలీజ్ చేయొద్దని కోరుతున్నారట. వాస్తవంగా చూసుకుంటే అతి తక్కువ ఖర్చుతో బోలెడంత కంటెంట్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌ లో ఉన్న అమెజాన్ ప్రైమ్ లాంటివి సినిమాలు మరియు వెబ్ సిరీస్‌ లు ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు అందిస్తాయి. అతి తక్కువ సబ్‌స్క్రిప్షన్ ఖర్చుతో ఈ విధంగా ఆడియన్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కి అలవాటు పడితే మా పరిస్థితి ఏంటి అని థియేటర్ యాజమాన్యాలు అంటున్నాయి.

 

వాస్తవంగా చూసుకుంటే మల్టీప్లెక్స్ థియేటర్ లో ఒక సినిమా టికెట్ ధర 150 నుంచి 250 వరకు ఉంటుంది. అదే సమయంలో థియేటర్లో పాప్ కార్న్, ఐస్ క్రీమ్ మరియు కూల్ డ్రింక్స్ వంటివాటిపై కూడా వ్యాపారం పోతుందని థియేటర్ యాజమాన్యాలు అంటున్నాయట. దీంతో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ దెబ్బకీ థియేటర్ ల అసలు రంగులు బయట పడుతున్నాయి. థియేటర్ లో కూల్ డ్రింక్, పాప్ కార్న్ పై మరియు ఐస్ క్రీమ్ వంటి వాటిపై ఎగస్ట్రా ధరలతో అమ్ముతుంటారు. దీంతో వారి వ్యాపారం పోతుందని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ద్వారా సినిమాలు రిలీజ్ చేయొద్దని థియేటర్ యాజమాన్యాలు అనటాని చాలామంది తప్పు పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: