"ఇస్మార్ట్‌ శంకర్‌" లాంటి మాస్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ మూవి ‘ఫైటర్‌'. అయితే ఈ టైటిల్ ని ఇంకా ఫైనల్ చేయలేదు. అందుకు కారణం ఈ సినిమాని పాన్ ఇండియా కేటగిరీలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. విజయ్‌ దేవరకొండ-పూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్‌ను ఎక్కువశాతం ముంబయ్‌లోనే ప్లాన్‌ చేశారు.

 

అయితే ప్రస్తుతం ముంబై లో చేయాల్సిన షూటింగ్ మొత్తాన్ని హైదరాబాద్ లోనే ఫినిష్ చేసేందుకు పూరి చిన్న చిన్న మార్పులు చేస్తున్నారట. లాక్ డౌన్ తర్వాత హైదరా బాద్ పరిసర ప్రాంతాలు..అలాగే స్టూడియోస్ లో సెట్ వేసి చిత్రీకరించనున్నారని సమాచారం. ఇక విజయ్‌ బాక్సార్‌గా కనిపించనున్న ఈ సినిమా టాకీ పార్ట్ ఇప్పటివరకు నలభైశాతం షూట్‌ చేశారు. ఈ సినిమాకోసం గోవా, బ్యాంకాక్ లలో అనుకున్న షెడ్యూల్స్ ని క్యాన్సిల్ చేసి పూరి హైదరాబాద్ కి వచ్చేసిన సంగతి తెలిసిందే. 

 

ఇక బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడని మాట్లాడుకుంటున్నారు. ఫైటర్ గా ఫిట్ బాడీతో మాస్ గా కనిపించే విజయ్.. క్లీన్ షెవ్ తో నీట్ లుక్ లోను కనిపించబోతున్నాడట. అయితే ఇది డ్యూయల్ రోల్ ఆ కాదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్ గా ఉన్నప్పటికి విజయ్ ఇలా క్లాసీగా కనిపించేది మాత్రం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అని తెలుస్తుంది. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్, ఛార్మి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: